Nothing Phone (1) స్టాక్ వచ్చేసింది.. సేల్ ఎప్పుడంటే.!
Nothing Phone (1) సేల్ డేట్ అనౌన్స్
ఆగష్టు 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది
నథింగ్ ఫోన్ 1 ఇప్పుడు స్టాక్ లోకి వచ్చింది
Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ సేల్ మొదలవ్వగానే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్ అప్ కమింగ్ సేల్ ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. నథింగ్ ఫోన్ 1 ఇప్పుడు స్టాక్ లోకి వచ్చింది మరియు ఈ ఫోన్ యొక్క నెక్స్ట్ సేల్ ఆగష్టు 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.
SurveyNothing Phone (1): ధర మరియు సేల్
నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్ లలో లభిస్తుంది మరియు వీటి ధరలను క్రింద చూడవచ్చు
1.నథింగ్ ఫోన్ (1) (8GB+128GB) ధర : రూ.32,999
2.నథింగ్ ఫోన్ (1) (8GB+256GB) ధర : రూ.35,999
3.నథింగ్ ఫోన్ (1) (12GB+256GB) ధర : రూ.38,999
నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ August 22 మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి ఉంటుంది.
Nothing Phone (1): స్పెక్స్
నథింగ్ ఫోన్ (1) 6.55 ఇంచ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే మరియు 60Hz -120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లేని ఎగువ ఎడమ మూలలో పంచ్-హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 778G+ శక్తితో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 642L GPU తో పనిచేస్తుంది. ఇది 12GB ర్యామ్ మరియు 256GB UFS 3.1 వరకూ స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత Nothing OS తో పనిచేస్తుంది.
ఇక నథింగ్ ఫోన్ (1) ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అయితే, ఈ సెటప్ లో భారీ కెమెరాలనే అందించింది. ఇందులో, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు EIS సపోర్ట్ తో 50MP SonyIMX766 కెమెరాగా జతగా 50MP (Samsung JN1) సెన్సార్ ని రెండవ కెమెరాగా అందించింది. అలాగే, సెల్ఫీల కోసం ముందు 16MP SonyIMX471 కెమెరాని జతచేసింది.
నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను మాత్రం చేర్చలేదు. అంటే, ఈ ఫోన్ కోసం మీరు ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేయాలి. నథింగ్ ఫోన్ (1) పూర్తిగా మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది మరియు 7.6mm మందంతో చాలా స్లిమ్ గా ఉంటుంది. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, వైఫై 6, బ్లూటూత్ 5.2 మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile