Xiaomi Power Bank: బడ్జెట్ ధరలో 67W ఫాస్ట్ ఛార్జ్ తో 20000mAh పవర్ బ్యాంక్ లాంచ్.!

HIGHLIGHTS

షియోమీ ఈరోజు ఇండియాలో కొత్త పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది.

షియోమీ పవర్ బ్యాంక్ 5i 20000 67w మరియు ఇది బిల్ట్ ఇన్ టైప్ C కేబుల్ తో వస్తుంది

ఇది 12 లేయర్ ప్రొటక్షన్ సపోర్ట్ తో వస్తుంది

Xiaomi Power Bank: బడ్జెట్ ధరలో 67W ఫాస్ట్ ఛార్జ్ తో 20000mAh పవర్ బ్యాంక్ లాంచ్.!

Xiaomi Power Bank: షియోమీ ఈరోజు ఇండియాలో కొత్త పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. అదే, షియోమీ పవర్ బ్యాంక్ 5i 20000 67w మరియు ఇది బిల్ట్ ఇన్ టైప్ C కేబుల్ తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ను బడ్జెట్ ధరలో 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 20000mAh పవర్ తో విడుదల చేయడం విశేషం. మరి షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ పవర్ బ్యాంక్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi Power Bank: ప్రైస్

షియోమీ పవర్ బ్యాంక్ 5i 20000 67w మోడల్ ను ఈరోజు రూ. 3,299 ధరతో లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ బ్లూ మరియు బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ జూలై 28వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Xiaomi Power Bank: ఫీచర్స్

ఈ షియోమీ కొత్త పవర్ బ్యాంక్ సింపుల్ డిజైన్ లో బిల్ట్ ఇన్ టైప్ C పోర్ట్ తో వస్తుంది. ఈ లేటెస్ట్ పవర్ బ్యాంక్ ట్రావెలింగ్ కోసం చేతిలో ఇమిడి ఉండే మరియు హ్యాంగింగ్ సెటప్ తో వస్తుంది. ఇది టోటల్ 20000mAh పవర్ తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను సైతం రెండు నుంచి మూడు సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇక ఈ పవర్ బ్యాంక్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 12 లేయర్ ప్రొటక్షన్ సపోర్ట్ తో వస్తుంది. టెంపరేచర్ ప్రొటెక్షన్, కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, రీసెట్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ మరియు అవుట్ పుట్ ఓవర్ ప్రొటెక్షన్ వంటి టోటల్ 12 లేయర్ ప్రొటెక్షన్ ఈ పవర్ బ్యాంక్ కలిగి ఉంది.

Xiaomi Power Bank

అలాగే, ఇందులో మూడు 6700mAh హై కెపాసిటీ బ్యాటరీలు కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం మూడు పోర్ట్ అవుట్ పుట్ ని అందించారు. వాటిలో బిల్ట్ ఇన్ USB-C పోర్ట్, USB-C మరియు USB-A పోర్ట్ ఉన్నాయి. ఇక ఛార్జ్ విషయానికి వస్తే, ఈ కొత్త పవర్ బ్యాంక్ 67W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ తో ఆండ్రాయిడ్ ఫోన్, అన్ని మొబైల్ ఫోన్స్, ఐఫోన్, ఐప్యాడ్ మరియు మ్యాక్ బుక్ లతో పాటు బడ్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: OnePlus N6x : లాంచ్ డేట్ మరియు డిజైన్ రివీల్ చేసిన వన్ ప్లస్.. ఫోన్ అదిరింది భయ్యా.!

ఈ పవర్ బ్యాంక్ లో ఉన్న ఛార్జ్ విలువ వెల్లడించే డిజిటల్ డిస్ప్లేని కూడా కంపెనీ ఇందులో అందించింది. ఇందులో కచ్చితమైన బ్యాటరీ లెవల్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేటస్ మరియు లో కరెంట్ మోడ్ వంటివి ఉంటాయి. అంతేకాదు, ఇది PD 3.0 మరియు QC 3.5 వంటి అడ్వాన్స్‌డ్ ఛార్జింగ్ ప్రోటోకాల్ కూడా ఈ పవర్ బ్యాంక్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile