New Toll Rules: టోల్ గేట్ వద్ద క్యాష్ పేమెంట్ చేస్తే రెండింతలు చెల్లించాలి.!
క్యాష్ మరియు UPI పేమెంట్ చేసే వాహనదారుల ప్రభుత్వం కొత్త రూల్స్ అందించింది
ఇక నుంచి FASTag లేకుండా జాతీయ రహదారి పై ఎక్కే వాహనాలకు ఫీజు వడ్డింపు
క్యాష్ పేమెంట్ చేసే వారు రెండింతలు చెల్లించాలని నియమం
New Toll Rules: ఇక నుంచి FASTag లేకుండా క్యాష్ మరియు UPI పేమెంట్ చేసే వాహనదారుల ప్రభుత్వం కొత్త రూల్స్ అందించింది. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ఇంకా వాహనాలు నడుస్తున్నాయి మరియు అటువంటి వాహనాలు కలిగిన వారు ఎక్కువగా క్యాష్ మోడ్ తో టోల్ గేట్ వద్ద పేమెంట్ చేస్తున్నారు. అయితే, నవంబర్ 15 నుంచి రానున్న కొత్త నియమాలతో ఫాస్ట్ ట్యాగ్ లేకుండా జాతీయ రహదారుల పై ప్రయాణించే వాహనాలకు కొత్త టోల్ రేట్ల కోసం దిశానిర్దేశం అందించింది. ఇక నుంచి టోల్ గెట్ వద్ద క్యాష్ పేమెంట్ చేసే వారు రెండింతలు చెల్లించాలని నియం పెట్టింది. అంతేకాదు, UPI పేమెంట్ చేసే వారు కూడా 0.25 అధిక ఫీజు చెల్లించాలి.
SurveyNew Toll Rules
ప్రభుత్వం అన్ని విభాగాల్లో అమలు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ ని మరింత ప్రోత్సాహించేలా ఈ కొత్త రూల్స్ అందించింది. ఈ కొత్త రూల్స్ చాలా సింపుల్ గా ఉంటాయట. వ్యాలిడ్ FASTag తో చెల్లింపు చేసే వారికి ఎటువంటి అదనపు ఫీజలు వర్తించదు. అయితే, కొత్త రూల్స్ ప్రకారం వ్యాలిడ్ ఫాస్ట్ ట్యాగ్ లేకుండా జాతీయ రహదారి పై నడిచే వాహనాలు UPI ద్వారా పేమెంట్ చేస్తే 1.25 రేట్లు టోల్ ఫీజు చెల్లించాలి. ఇది కూడా ఒక రకంగా తక్కువ అవుతుంది, ఎందుకంటే క్యాష్ పేమెంట్ చేసే వాహనాలకు ఏకంగా రెండింతలు ఫీజు చెల్లించాలని రూల్ పెట్టింది.

అంటే, ఫాస్ట్ ట్యాగ్ తో టోల్ గేట్ వద్ద ఫీజు చెల్లించే వాహనదారుడు రూ. 100 చెల్లిస్తే, UPI పేమెంట్ ఆప్షన్ తో టోల్ ఫీజు చెల్లించే వారు 0.25 పెంచి అంటే రూ. 125 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే క్యాష్ పేమెంట్ చేయాలనుకుంటే ఏకంగా రూ. 200 చెల్లించాలి అని రూల్ పెట్టింది. ఈ కొత్త రూల్స్ 2025 నవంబర్ 15వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: IMC 2025 లో Jio 6G టెక్నాలజీతో మెరిసిన రిలయన్స్ జియో.!
ఈ కొత్త రూల్స్ తో ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవడం ఉత్తమం. లేదు ఆన్లైన్ లో UPI ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే కూడా 0.25% అదనపు రుసుము చెల్లించుకోవాలి. ఈ కొత్త రూల్స్ తో అన్ని వాహనాలు కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డిజిటలైజేషన్ కావడానికి అవకాశం ఉంటుంది.