షావోమి కొత్త స్మార్ట్ బెడ్ సైడ్ లాంప్ 2 లాంచ్

షావోమి కొత్త స్మార్ట్ బెడ్ సైడ్ లాంప్ 2 లాంచ్
HIGHLIGHTS

ఈ కొత్త స్మార్ట్ బెడ్ సైడ్ లాంప్ 2 కూడా 16 మిలియన్ రకాలైన రంగులను అందిస్తుంది.

షావోమి, తన Crowdfunding  నుండి మరొక తాజా ప్రోడక్ట్ అయినటివంటి మి స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2 ని తీసుకొచ్చింది. ఇది బెడ్ పక్కన వుండే లాంప్, దీన్ని  Mi Home హోమ్ యాప్ ఉపయోగించి నియంత్రించవచ్చు. ఇది షెడ్యూల్‌ టైం సెట్ చేయడానికి మరియు అస్థిరమైన ఫ్లో మోడ్‌ను ప్రారంభించడానికి వినియోగదారులకు యాక్సెస్ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ ను రూ .2,299 ధలో తీసుకొచ్చింది మరియు డిసెంబర్ 3 నుండి దీని యొక్క షిప్పింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చిన LED  స్మార్ట్ బల్బ్ మాదిరిగానే, షియోమి యొక్క ఈ కొత్త స్మార్ట్ బెడ్ సైడ్ లాంప్ 2 కూడా 16 మిలియన్ రకాలైన రంగులను అందిస్తుంది.

మి స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2 వై-ఫై-ఎనేబుల్ మరియు అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ మరియు ఆపిల్ హోమ్‌కిట్‌లతో పనిచేస్తుంది, కాబట్టి వినియోగదారులు దీన్ని వారి వాయిస్‌తో నియంత్రించవచ్చు. ఇంకా, ఇది డబుల్ లేయర్ లాంప్‌షేడ్‌తో అమర్చబడి, వెచ్చని కాంతిని ఇస్తుంది. ఈ డివైజ్ టచ్-సెన్సిటివ్ ప్యానల్‌ను కలిగి ఉంది, ఇది బ్రైట్నెస్ సర్దుబాటు చేయడానికి, లైట్ కలర్ + మోడ్‌ ను మార్చడానికి మరియు లైట్  ఆన్ / ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులు చిన్న లేదా పొడవైన ప్రెస్‌తో లైట్ లేదా మోడ్ యొక్క రంగును మార్చవచ్చు. స్లైడ్ పైకి లేదా క్రిందికి వంటి చర్యలు బ్రైట్నెస్ సర్దుబాటు చేయడానికి మరియు లైట్ ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి పని చేస్తాయి. షియోమి మి స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2 కు 11 సంవత్సరాల లైఫ్ ఉందని, రోజుకు సగటున 6 గంటలు వీడుకోవచ్చని తెలిపింది.

వినియోగదారులు 16 మిలియన్ రంగుల నుండి ఎంచుకోవచ్చు మరియు బ్రైట్నెస్ లేదా కల టెంపరేచర్ ను 1700K నుండి 6500K వరకు సర్దుబాటు చేయవచ్చు. మి స్మార్ట్ బెడ్‌సైడ్ లాంప్ 2 తగినంత మద్దతుదారులు ఆన్లైన్ లో ఉన్న తర్వాత ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి, షావోమి క్రౌడ్ ఫండింగ్ కోసం 2 వేల యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొనుగోలుదారులు తమ ఆర్డర్ ను  చెయ్యడానికి 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo