దడపుట్టిస్తున్న డీప్ ఫేక్.. ఒక్కకాల్ తో 200 కోట్లు స్వాహా | Tech News

HIGHLIGHTS

ఇప్పుడు ఎక్కడ చూసినా డీప్ ఫేక్ బాధితులే ఎక్కువ కనిపిస్తున్నారు

ఒక్కకాల్ తో 200 కోట్లు స్వాహా చేసిన డీప్ ఫేక్ వీడియో కాల్

డీప్ ఫేక్ టెక్ స్కామర్లకు గొప్ప ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది

దడపుట్టిస్తున్న డీప్ ఫేక్.. ఒక్కకాల్ తో 200 కోట్లు స్వాహా | Tech News

ఇప్పుడు ఎక్కడ చూసినా డీప్ ఫేక్ బాధితులే ఎక్కువ కనిపిస్తున్నారు. డీప్ ఫేక్ దెబ్బకి సెలబ్రెటీలు సైతం వణికి పోతున్నారంటే, ఈ టెక్నాలజీ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధమవుతోంది. ఇప్పటి వరకూ సెలెబ్రేటిస్ యొక్క డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి వైరల్ చేయడం మాత్రమే పరిపాటిగా మారింది. అయితే, ఇప్పుడు ఈ డీప్ ఫేక్ టెక్ స్కామర్లకు గొప్ప ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, లేటెస్ట్ గా ఒక్కకాల్ తో 200 కోట్లు స్వాహా చేసిన డీప్ ఫేక్ వీడియో కాల్ స్కామ్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇటీవల ప్రముఖ నాయకి రష్మికా మండన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. తరువాత, బాలీవుడ్ హీరోఇన్ ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియో కూడా మరింత సంచలనం సృష్టించింది. అయితే, ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఇప్పుడు జరిగింది మాత్రం నిజంగా యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంత పోయేలా చేసింది.

Shocking News

new scam Heald by deep fake video

డీప్ ఫేక్ వీడియో కాల్ తో హాంగ్ కాంగ్ కు చెందిన ఒక కంపెనీ ఉద్యోగులను బురుడి కొట్టించి ఏకంగా $25.6 మిలియన్ డాలర్లు కొట్టేశారు. అంటే, మన దేశ కరెన్సీలో సుమారు 212.5 కోట్ల రూపాయలుగా ఉంటుంది. అంటే, ఈ స్కామ్ రేంజ్ ఏంటో మీకు అర్ధం అవుంతుంది. దీనికోసం ఉపయోగించింది కేవలం ఒక్క డీప్ ఫేక్ కాల్ మాత్రమే.

Also Read : 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసిన Ambrane బ్రాండ్.!

ఎలా చేశారు ఈ స్కామ్?

ఎలా చేశారు ఈ స్కామ్ అని చెబితే అస్సలు నమ్మరు. ఎందుకంటే, ఈ స్కామ్ కోసం స్కామర్లు ఉపయోగించింది అధునాతన డీప్ ఫేక్ టెక్నాలజీ మాత్రమే. అచ్చంగా కంపెనీ CEO మరియు సంబంధిత అధికారుల మాదిరిగా కన్పిస్తున్న డీప్ ఫేక్ సెటప్ వీడియో కాల్ ను ఉపయోగించి హాంగ్ కాంగ్ కంపెనీ ఎంప్లాయిస్ నుండి 25.6 లక్షల డాలర్లను కొట్టేశారు.

ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే వీడియోలో ఉన్న అందరూ కూడా ఒరిజినల్ గా కనిపించడం మరియు అన్ని క్లియర్ గా ఉండటం ఆశ్చర్యం కలిగించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo