NEET UG Admit Card online download process explained telugu
NEET UG Admit Card: నీట్ UG 2026 రీ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుభవార్త అందించింది. జూన్ 21, 2026 న జరగనున్న నీట్ UG రీ ఎగ్జామినేషన్ కోసం అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ లో రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఇప్పుడు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం NEET UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది.
అభ్యర్థులు అధికారిక NEET వెబ్ సైట్ neet.nta.nic.in ద్వారా తమ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింద సూచించిన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ఈ వివరాలు దగ్గర పెట్టుకుని అధికారిక NEET వెబ్ సైట్ ను సందర్శించండి. హోమ్‌పేజీలో కనిపించే “NEET UG 2026 Re-Examination Admit Card” లింక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లేదా / ఆఫ్ బర్త్ నమోదు చేయండి. తర్వాత Submit బటన్ పై క్లిక్ చేయండి. అంతే, మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ హాల్ టికెట్ ను PDF రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ ను కనీసం 2-3 ప్రింట్ కాపీలు తీసుకోవడం మంచిది.
మీ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయండం చాలా ముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకోండి.
Also Read: SONY 5.1 Dolby సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ జూన్ ఎపిక్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసిన వెంటనే ఈ క్రింద తెలిపిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి.
ఒకవేళ పైన తెలిపిన వివరాలలో ఏదైనా తప్పులు ఉంటే, వెంటనే NTA హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలి. NEET UG 2026 రీ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను వెంటనే డౌన్ లోడ్ చేసుకుని అందులోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పరీక్ష రోజున అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాయవచ్చు.