National Technology Day: భారత సాంకేతిక గురించి ప్రపంచానికి చాటి చెప్పిన రోజు.!

HIGHLIGHTS

టెక్నాలజీ పరంగా అతిపెద్ద రాజ్యాలతో తలపడే స్థాయిలో ఈరోజు భారతదేశం సగర్వంగా నిలబడింది

ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు

భారత టెక్నాలజీ పోఖ్రాన్ నుంచి ప్రారంభమైన సాంకేతిక విప్లవం గా అభివర్ణిస్తారు

National Technology Day: టెక్నాలజీ పరంగా అతిపెద్ద రాజ్యాలతో తలపడే స్థాయిలో ఈరోజు భారతదేశం సగర్వంగా నిలబడింది. భారతదేశం సాంకేతిక రంగంలో అందించిన ప్రగతికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు. అంతేకాదు, ఇదే రోజున జరుపుకోవడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. 1998 లో రాజస్థాన్‌ లోని పోఖ్రాన్‌ లో విజయవంతంగా నిర్వహించిన అణు పరీక్ష తర్వాత భారత్ ప్రపంచ దేశాలకు తన సాంకేతిక సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం గా జరుపుకుంటాము.

National Technology Day:

భారత టెక్నాలజీ గురించి ఒక్క మాట చెప్పాలంటే, పోఖ్రాన్ నుంచి ప్రారంభమైన సాంకేతిక విప్లవం గా అభివర్ణిస్తారు. 1998 మే 11న భారత శాస్త్రవేత్తలు నిర్వహించిన “పోఖ్రాన్-II” అణు పరీక్ష దేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. ఈ ఘన విజయంతో భారతదేశం అణు శక్తి కలిగిన దేశాల జాబితాలో నిలిచింది. అప్పటి నుంచి భారతదేశం శాస్త్ర మరియు సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ఈ విజయానికి ఎంతో ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు దేశ నాయకుల కృషి చేశారు. ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత యువతకు సాంకేతిక రంగంలో ప్రేరణగా నిలిచారు.

2026 లో టెక్నాలజీ రంగంలో భారత ప్రగతి

2026 నాటికి భారత్ కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధన, డిజిటల్ సేవలు మరియు గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో విశేష ప్రగతి సాధిస్తోంది. “డిజిటల్ ఇండియా”, “మేక్ ఇన్ ఇండియా”, “స్టార్టప్ ఇండియా” వంటి అనేక కార్యక్రమాలు యువతలో ఆవిష్కరణలకు దారితీసేలా చేస్తున్నాయి.

ఇప్పుడు భారతీయ స్టార్టప్‌ లు ప్రపంచ మార్కెట్లో తమ ప్రతిభను నిరూపిస్తున్నాయి. AI ఆధారిత సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య సాంకేతికత మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారత కంపెనీలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్నాయి.

ప్రధాని మోదీ సందేశం

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షల విజయాన్ని గుర్తు చేస్తూ, “సాంకేతికతే ఆత్మనిర్భర్ భారత్‌కు బలం” అని పేర్కొన్నారు. దేశ యువత సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రత్యేకంగా స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి, డిజిటల్ మార్పు మరియు రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికత అవసరాన్ని కూడా అయన ప్రస్తావించారు.

Also Read: Sony Dolby Soundbar అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 7 వేలకే సేల్ చేస్తోంది.!

యువతకు అపార అవకాశాలు

ప్రస్తుతం టెక్నాలజీ రంగం యువతకు అనేక అవకాశాలను అందించింది మరియు ఇక ముందు కూడా అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌ వేర్ డెవలప్‌మెంట్ మరియు అంతరిక్ష పరిశోధనలు వంటి రంగాల్లో భారత విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ కనబరుస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఉద్యోగాలకే కాదు, సమాజ సమస్యలకు పరిష్కారాలను అందించే సాధనంగా కూడా మారింది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు ప్రతి రంగంలో టెక్నాలజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :