120Hz రిఫ్రెష్ రేట్ Fluid డిస్ప్లేతో మిడ్ రేంజ్ ధరలో వచ్చిన మోటో కొత్త 5G ఫోన్.!
మోటోరోలా ఇండియాలో మరొక 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
120Hz రిఫ్రెష్ రేట్ Fluid డిస్ప్లేతో మిడ్ రేంజ్ ధరలో తీసుకువచ్చింది
ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది
మోటోరోలా ఇండియాలో మరొక 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ Fluid డిస్ప్లేతో మిడ్ రేంజ్ ధరలో తీసుకువచ్చింది. అదే, Moto G62 5G మరియు ఈ ఫోన్ 50MP క్వాడ్ ఫంక్షన్ కెమెరా మరియు Dolby Atoms సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచింది. వచ్చే వారంలో మొదటి సరిగా అమ్మకానికి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు తెలుసుకోండి.
Moto G62 5G: ధర మరియు లాంచ్ ఆఫర్లు
Moto G62 5G బేసిక్ వేరియంట్ (6GB+128GB) ధర రూ.17,999 రూపాయలు. హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) ధర రూ.19,999 రూపాయలు. ఈ ఫోన్ ఆగష్టు 19 నుండి Flipkart ద్వారా ఉపలబ్ధమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,500 తగ్గింపు అఫర్ ను కూడా ప్రకటించింది.
Moto G62 5G: స్పెక్స్
Moto G32 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ Fluid డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు బ్రిలియంట్ కలర్ తో వుంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరాతో వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా 2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.