Moto G71 5G స్మార్ట్ ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు..!!

Moto G71 5G స్మార్ట్ ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు..!!
HIGHLIGHTS

Moto G71 5G రూ.3,000 భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది

మోటో జి71 5 చాలా చవక ధరకే లభిస్తోంది

,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G71 5G రూ.3,000 భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. ఇటీవల ఇండియాలో మోటోరోలా విడుదల చేసిన ఈ 5G స్మార్ట్ ఫోన్ తగ్గింపు తర్వాత చాలా చవక ధరకే లభిస్తోంది. Flipkart నుండి ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో పాటుగా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో కూడా లభిస్తోంది.

Moto G71 5G: ప్రైస్

Moto G71 5G ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ. 18,999 ధరతో వచ్చింది. అయితే, ఇప్పుడు Flipkart నుండి 3,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.          

Moto G71 5G: స్పెక్స్

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది పంచ్ హోల్ డిజైన్ మరియు DCI-P3 తో వస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ తో జతచెయ్యబడింది. అధనంగా, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

ఈ ఫోన్ ThinkShield మొబైల్ సెక్యురితో బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ అఫర్ చేస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగిఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo