Moto లేటెస్ట్ 108MP ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు..!!

HIGHLIGHTS

Moto లేటెస్ట్ 108MP ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు

కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ లో 108MP కెమెరా ఫోన్

1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Moto లేటెస్ట్ 108MP ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు..!!

Moto లేటెస్ట్ 108MP ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు పొందే అద్భుతమైన అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ అఫర్ ద్వారా కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ లో 108MP కెమెరా కలిగిన మోటో స్మార్ట్ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం కెమెరా మాత్రమే కాదు, ఈ ఫోన్ FHD+ HDR 10 సపోర్ట్ కలిగిన గొప్ప డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లతో అలరిస్తుంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ స్మార్ట్ ఫోన్ అఫర్ పైన ఒక లుక్ వేయండి.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మనం మాట్లాడుకుంటుంది మోటోరోలా ఇటీవల ప్రకటించి 108MP కెమెరా ఫోన్ Moto G60 గురించి. ఈ స్మార్ట్ ఫోన్ మరియు దీని పైన అందించిన ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.   

Moto G60: అఫర్ ధర

మోటో జి60 స్మార్ట్ ఫోన్ ఇండియాలో కేవలం (6GB + 128GB) సింగిల్ వేరియంట్ తో లభిస్తుంది మరియు లాంచ్ సమయంలో Rs.17,999 రేటు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు Flipkart నుండి 3,000 రూపాయల భారీ తగ్గింపుతో కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తోంది. అంతేకాదు, SBI క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.    

Moto G60

Moto G60 స్మార్ట్ ఫోన్ మోటో G60 కొంచెం పెద్దదైన 6.78- ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ HDR 10 సపోర్ట్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా పంచ్ హోల్ కెమేరా డిజైనుతో కలిగి ఉంటుంది. అలాగే, మోటో G60 స్మార్ట్ ఫోన్ 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G తో వస్తుంది. ఇది మంచి పవర్ ఎఫిషియంట్ మరియు గేమింగ్ ప్రొసెసర్. ఈ స్మార్ట్ ఫోన్ ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది. 

మోటో G60 లో వెనుక క్వాడ్ ఫిక్షన్ కెమెరా ఉంటుంది. ఇందులో, 108MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్&మ్యాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయి.ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని మోటో అందించింది. ఇక మోటో G 60 ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇది ఒక  పెద్ద 6000mAh బిగ్  బ్యాటరీని 20W టర్బో/క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ తో కలిగి వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo