Moto G42: జూలై 4 న లాంచ్ అవుతున్న మోటో కొత్త ఫోన్..!

HIGHLIGHTS

Moto G42 జూలై 4 న ఇండియాలో లాంచ్ అవుతోంది

ఇప్పటికే Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది

ఈ పేజ్ ద్వారా కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది

Moto G42: జూలై 4 న లాంచ్ అవుతున్న మోటో కొత్త ఫోన్..!

Moto G42 స్మార్ట్ ఫోన్ ను జూలై 4 న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ డేట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటికే Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది మరియు ఈ పేజ్ ద్వారా కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను #uneashyourstyle అనే క్యాప్షన్ తో కంపెనీ తీసుకొచ్చింది. మోటరోలా తీసుకువస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటికే అదించైనా వివరాలు ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G42: స్పెక్స్ మరియు ఫీచర్లు

మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto G42 ఫోన్ యొక్క వెల్లడైన స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 64GB స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మెమొరీ కార్డ్ ద్వారా 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.   

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS మరియు వాటర్ రిపెలెంట్ IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా తీసుకువస్తుంది. ఈ ఫోన్ మెటాలిక్ రోజ్ మరియు అట్లాంటిక్ గ్రీన్ అనే రెండు అందమైన కలర్ లలో వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo