10 లక్షల యూనిట్ల సేల్ మార్క్ దాటిన Mi BAND 3

10 లక్షల యూనిట్ల సేల్ మార్క్ దాటిన Mi BAND 3
HIGHLIGHTS

దీనిని కొనడానికి ఇష్టపడే వారు Mi.com మరియు అమేజాన్ నుండి రూ . 1,999 ధరతో కొనవచ్చు.

సెప్టెంబర్ 2019, బెంగుళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో షావోమి తన Mi BAND 3 ని విడుదల చేసింది. ఈ మి బ్యాండ్ 3 ఇండియాలో రూ . 1,999 ధరతో విడుదల చెయ్యబడింది. ఆకట్టుకునే ప్రత్యకతలో ఈ ప్రొడక్టు అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ Mi BAND 3 యొక్క10 లక్షల కంటే పైచిలుకు యూనిట్లు అమ్ముడైనట్లు, షావోమి సంస్థ చెబుతోంది. దీనిని కొనడానికి ఇష్టపడే వారు Mi.com మరియు అమేజాన్  నుండి రూ . 1,999 ధరతో కొనవచ్చు.

షావోమి మి బ్యాండ్ 3 ప్రత్యేకతలు

షావోమి మి బ్యాండ్ 3, దాదాపుగా షావోమి మి బ్యాండ్ 2 వంటి ఒక నమూనాతో ప్రారంభించబడింది, అయితే ఇప్పుడు సంస్థ దీనికి 2.5D కర్వ్డ్ గ్లాస్ ని జోడించింది. దీనికి అదనంగా మనకు, 0.78-అంగుళాల OLED స్క్రీన్ ని ఇచ్చారు, దీనితో ఈ పరికరం మరింత ఆకర్షణీయంగా ఉంది. షావోమి మి బ్యాండ్ 3 యొక్క ప్రదర్శన తీరు గురించి మాట్లాడితే, ఇది దాదాపుగా 128X80 పిక్సల్స్ కలిగి ఉంటుంది. దీనిని మీరు నలుపు మరియు తెలుపు రంగుల ఎంపికగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫిట్నెస్ బ్యాండ్లో, షావోమి మి బ్యాండ్ 2 కంటే  కొంత పెద్ద డిస్ప్లే ని ఇచ్చారు. దీనితో పాటు, ఈ  కొత్త బ్యాండ్ ఇప్పుడు మీకు మూడు-రోజుల వాతావరణ సమాచారం ఇస్తుంది, ఈ ఫీచర్ మి బ్యాండ్ 2 లో అందుబాటులో లేదు.

దీనితో పాటు, మీ బ్యాండ్ 3 లో 110mAh సామర్ధ్యం గల బ్యాటరీ ఇవ్వబడింది, ఇది 20-రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ వాగ్దానం చేస్తుంది. దీనితో పాటు మీరు దానిపై ట్రాకింగ్ లక్షణాన్ని కూడా ఆపివేయవచ్చు. ఇందులో హృదయ స్పందన రేటుతో మరొక లక్షణం ఉంటుంది . ఇది కాకుండా, ఇతర ఫీచర్లలో మీరు నిద్ర పర్యవేక్షణ, స్టెప్ కౌంట్ ట్రాకర్, సైక్లింగ్, స్విమ్మింగ్ మరియు వాకింగ్ మొదలైనవి పొందుతున్నారు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo