Lava O2 Launch: లావా అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ లాంఛ్ డేట్ కన్ఫర్మ్ చేసింది.!

HIGHLIGHTS

లావా అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ లాంఛ్ డేట్ కన్ఫర్మ్ చేసింది

Lava O2 మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో లాంఛ్ అవుతుంది

ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కూడా ఈ లాంఛ్ డేట్ తో పాటుగా వెల్లడించింది

Lava O2 Launch: లావా అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ లాంఛ్ డేట్ కన్ఫర్మ్ చేసింది.!

Lava O2 Launch: లావా అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ లాంఛ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. లావా ఓ2 స్మార్ట్ ఫోన్ ను మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో లాంఛ్ చేస్తునట్లు, ఈరోజు డేట్ ను అనౌన్స్ చేసింది. అంతేకాదు, విడుదల తేదీతో పాటుగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా అనౌన్స్ చేసింది. లావా అప్ కమింగ్ ఫోన్ కొత్త సంగతులు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava O2 Launch

లావా ఓ2 స్మార్ట్ ఫోన్ ను 22 March 2024 మధ్యాహ్నం 12 గంటలు లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ డేట్ కన్ఫర్మ్ చేసింది. లావా అధికారిక ట్విట్టర్ అకౌంట్ మరియు Amazon మైక్రో సైట్ పేజ్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కూడా ఈ లాంఛ్ డేట్ తో పాటుగా వెల్లడించింది.

Also Read: Motorola Edge 50 Pro: సూపర్ కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో వస్తోంది.!

Lava O2 : Specs

లావా ఓ2 స్మార్ట్ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫాస్టెస్ట్ ప్రోసెసర్ Unisoc T616 కలిగిన ఫోన్ గా నిలుస్తుందని లావా టీజింగ్ చేస్తోంది. యునిసోక్ యొక్క ఈ ప్రోసెసర్ బడ్జెట్ ప్రోసెసర్. అంటే, లావా ఈ అప్ కమింగ్ ఫోన్ ధర గురించి చెప్పకనే చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది.

Lava O2 Performance
Lava O2 Performance

ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ లో 50MP మెయిన్ కెమేరా ఉన్నట్లు కూడా లావా కన్ఫర్మ్ చేసింది. ఈ లావా ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన డిస్ప్లేతో ఉన్నట్లు పేజ్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఇది HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ కలిగిన స్క్రీన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

లావా ఓ2 స్మార్ట్ ఫోన్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా అందించింది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు టైప్ C పోర్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo