సర్కారు వారి పాటతో పాటు OTT లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాలు చూశారా.!

HIGHLIGHTS

ఈ వారం కూడా OTT లో కొత్త సినిమాలు సందడి చేశాయి

ఈ వారం సర్కారు వారి పాటతో పాటు OTT లో మరికొన్ని కొత్త సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి

చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి సందD కూడా వుంది

సర్కారు వారి పాటతో పాటు OTT లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాలు చూశారా.!

ఈ వారం కూడా OTT లో కొత్త సినిమాలు సందడి చేశాయి. ఈ వారం సర్కారు వారి పాటతో పాటు OTT లో మరికొన్ని కొత్త సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. వీటిలో, చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి సందD కూడా వుంది. మరి ఈ వారం సర్కారు వారి పాటతో పాటు OTT లో స్ట్రీమ్ అవుతున్న కొత్త సినిమాల మరియు వాటి విశేషాలు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సర్కారు వారి పాట

మే 2న థియేటర్లలో విడుదలై భారీ కలక్షన్స్ సాధించిన సర్కారు వారి పాట సినిమా OTT రైట్స్ ను అమెజాన్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ముందుగా, ఈ సినిమాను జూన్ 2 నుండి రెంటల్ అప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ మూవీగా కూడా నిలిచింది. జూన్ 23 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందరి కోసం జూన్ 23 నుండి స్ట్రీమ్ అవుతోంది.

డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్

వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం మార్వెల్స్ కామిక్స్ ఆధారంగా చిత్రించబడినది. మే 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలక్షన్స్ సాధించింది. జూన్ 22 నుండి డిస్ని+ హాట్ స్టార్ నుండి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మరియు ఊహించని మలుపులతో వుండే స్టోరీ ప్రక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

పెళ్లి సందD

ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'పెళ్లి సందD'. ఈ సినిమా 2021 అక్టోబర్ 15 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఈ వారం OTT లో రిలీజ్ అయ్యింది. జూన్ 24వ తేదీ నుండి Zee 5 నుండి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే OTT లో రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో థియేటర్లలో విదులైన చాలా కాలం తరువాత ఈ సినిమా OTT లో రావడం ఆశ్చర్యకరం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo