బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ లాంచ్ కావడానికి సిద్ధమవుతుండగా ఈ గేమ్ పైన IGN India ఇచ్చిన ఒక నివేదిక తరువాత అనేక అనుమానాలు రేకెత్తాయి. అయితే, ఈ గేమ్ గురించి వచ్చిన అన్ని రూమర్లు మరియు రిపోర్ట్ లను స్వాగతిస్తూ, ఈ గేమ్ యొక్క మాతృ సంస్థ krafton ఈ గేమ్ గురించి ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా తగిన క్లారిటీ ని ఇచ్చింది.
Survey
✅ Thank you for completing the survey!
Battlegrounds Mobile India గేమ్ ను పూర్తిగా ఇండియన్ చట్టాలు మరియు నిబంధనలను పూర్తిగా అనుసరిస్తుందని పేర్కొంది. అంతేకాదు, ప్లేయర్స్ యొక్క డేటా యొక్క సేఫ్టీ మరియు రక్షణ తమ ప్రధాన కర్తవ్యం అని కూడా తెలిపింది. అయితే, ప్రస్తుతం బీటా టెస్టింగ్ కోసం పరీక్షిస్తున్న ఈ గేమ్ ని మరింత సురక్షితంగా నిర్మించడానికి తర్డ్ పార్టీ సొల్యూషన్స్ సహాయం తీసుకోవడం జరిగిందని, ఈ గేమ్ ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసే నాటికీ ఇది పూర్తిగా భారతీయ చట్టాలకు లోబడి ఉంటుందని మరియు ఇప్పటి వరకూ కూడా ఎటువంటి డేటా షేరింగ్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది.
ఇది మాత్రమే కాదు, ఇతర గ్లోబల్ మొబైల్ గేమ్స్ మరియు యాప్స్ మాదిరిగానే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ను కూడా యూనిక్ ఫీచర్లతో తీసుకువచ్చేందుకు కూడా తర్డ్ పార్టీ సహాయం తీసుకోవవలసి వచ్చిందని కూడా తెలిపింది. ఇక PUBG అభిమానులకు కూడా ఒక గుడ్ న్యూస్ తెలిపింది. Battlegrounds Mobile India గేమ్ మరింత యూనిక్ గా ఉండేలా నియత్నిస్తోంది. అంతేకాదు, ప్లేయర్స్ కు ఎటువంటి ఇబంది కలిగినా కూడా రిపోర్ట్ చేసిన వెంటనే సమస్యను పరిష్కరించేలా చర్యలను తీసుకోనుందని చెబుతోంది.