Crypto Currency గురించి క్లియర్ గా తెలుసుకోండి..!

HIGHLIGHTS

Crypto Currency భారీగానే ప్రాచుర్యాన్నిసంతరించుకుంది

ట్రేడింగ్ చేసేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది

క్రిప్టో కరెన్సీ వలన కలిగే లాభ నష్టాలను మీరు తెలుసుకుంటే మంచిది

Crypto Currency గురించి క్లియర్ గా తెలుసుకోండి..!

Crypto Currency గురించి మనం రోజు వార్తల్లో చూస్తున్నాం. అంతేకాదు, ప్రభుత్వ జోక్య మరియు యువత దీన్నిపెట్టుబడి మార్గంగా ఎంచుకోవడంతో Crypto Currency భారీగానే ప్రాచుర్యాన్నిసంతరించుకుంది. ఈ విషయమే హ్యాకర్లు మరియు స్కామర్లు క్రిప్టో వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా సులభతరం చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గత సంవత్సరంలో బిట్ కాయిన్స్ విలువ భారీగా పెరగడం మరియు మార్కెట్లోని అస్థిరత కారణంగా క్రిప్టో కరెన్సీ మోసాలు మరింతగా పెరిగేందుకు దోహదం అయ్యాయి. వాస్తవానికి, ఆన్లైన్ లో నకిలీ క్రిప్టో కూడా చక్కర్లు కొడుతోంది. కాబట్టి, ట్రేడింగ్ చేసేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇటీవల, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. అందుకే, క్రిప్టో కరెన్సీ వలన కలిగే లాభ నష్టాలను మీరు తెలుసుకుంటే మంచిది.   

క్రిప్టో లో ఇన్వెస్ట్ చేసే ముందుగా దీని వలన కలిగే లాభ నష్టాలను గురించి తెలుసుకోండి.

క్రిప్టోకరెన్సీతో లాభాలు:

క్రిప్టోకరెన్సీ దేశాన్ని బట్టి విలువ మారదు

క్రిప్టోకరెన్సీ యూజర్ నుండి యూజర్ కు నేరుగా పంపించవచ్చు.

దీనికి, ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు

ట్రాన్స్ ఫర్ కోసం నామమాత్రపు ప్రోసెసింగ్ ఫీజ్ మాత్రమే ఉంటుంది

ఈ పాయింట్స్ మీకు అర్ధమయ్యేలా ఉదాహరించి చెబుతాను:

అమెరికాలో వున్న మీ ఫ్రెండ్ మీకు క్రిప్టోకరెన్సీ ని నేరుగా పంపించవచ్చు. వాస్తవానికి, రియల్ క్యాష్ ట్రాన్స్ ఫర్ విషయంలో డబ్బును మీకు ట్రాన్స్ ఫర్ చెయ్యాలంటే బ్యాంక్ లేదా మరింకేదైనా సంస్థ ద్వారా ఒక చట్టబద్దమైన పద్దతి ద్వారా మాత్రమే చెయ్యగలరు. దీనికోసం,  మధ్య వర్తిగా వ్యవహరించిన బ్యాంక్ లేదా సంస్థకు మీరు ఎక్కువ మొత్తాన్ని ప్రోసెసింగ్ ఫీజ్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది మరియు ఇది US డాల్సర్ నుండి ఇండియన్ కరెన్సీలో మారెప్పుడు విలువలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు.

క్రిప్టోకరెన్సీతో నష్టాలు:

క్రిప్టోకరెన్సీ ధర ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా పడిపోతుంది                       

క్రిప్టోకరెన్సీతో ఫ్రాడ్ మరియు మోసాలకు అవకాశం వుంది

క్రిప్టోకరెన్సీ తప్పుగా ట్రాన్స్ ఫర్ చేస్తే తిరిగిపొందే ఛాన్స్ ఉండదు

క్రిప్టోకరెన్సీ టోకెన్స్ కొనడం లాంటిది. మీరు కొన్న టోకెన్ మీకంటే ఎక్కువ ధర పెట్టి కొనేవారు ఉంటెనే మీకు లాభం వచ్చేది  

క్రిప్టోకరెన్సీ నుండి మీరు లాభాలను పొందితే దానికి టాక్సింగ్ నిర్వహణ సమస్య కూడా రావచ్చు

గమనిక: పైన తెలిపిన విషయాలు అన్ని కూడా కేవలం CryptoCurrency గురించి తెలియచేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఏవిధమైన ఇన్వెస్ట్ మెంట్ లేదా మరింకేదైనా లావాదేవీలను ఉధ్యేసించి ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo