e-బుక్ ప్రపంచంలో Kindle బుక్స్ పెట్టింది పేరు అనిచెప్పొచ్చు. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని e బుక్స్ కూడా చదువరులను అందరిని కూడా ఆకట్టుకోగా, ఇప్పుడు కోత్తగా తెసుకొచ్చిన ఈ Kindle Oasis అనేక కొత్త విషయాలతో వస్తుంది. ఇందులో, ముఖ్యంగా వార్మ్ లైట్ అడ్జెస్ట్మెంట్ చేసుకునే ఎంపికను గురించి చెప్పొచ్చు. అంటే, మన కళ్లకు తగినట్లుగా మరియు మనకు నచ్చినట్లుగా వార్మ్ లైట్ ను సరిచేసుకోవచ్చు.
ముందుగా వచ్చినటువంటి ఆల్ న్యూ కిండల్ మరియు ఆల్ న్యూ కిండల్ పేపర్ వైట్ కంటే కూడా చాల ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. ఇది 7 అంగుళాల గ్లేర్ ఫ్రీ సిక్రీన్ తో వస్తుంది. ముందుగా వచ్చిన వాటికంటే ఇది పెద్దగా ఉంటుంది. ఇది 8GB మరియు 32GB స్టోరేజి ఎంపికలతో లభిస్తుంది. ఇది 300 ppi రిజల్యూషన్ తో మంచి క్లారిటీతో వస్తుంది. వాటర్ ప్రూఫ్ IPX8 తో వస్తుంది కాబట్టి, నీటిలో లేదా స్విమ్మింగ్ ఫూల్ లో పడిన కూడా దీని ఎటువంటి నష్టం జరగదు.
ఈ Kindle Oasis కొనుగోలు చేసే ప్రైమ్ మెంబర్లకు వేలకొద్దీ బుక్స్, మ్యాగజైన్స్, మరియు మరిన్ని వాటికీ యాక్సెస్ పొందుతారు. అంతేకాదు, కిండిల్ అన్లిమిటెడ్ యాక్సెస్ తో వేలకొద్దీ టైటిల్స్ మరియు ఆడియో బుక్స్ యాక్సెస్ తెస్తుంది. ఇందులో అందించిన పేజీ టర్న్ బటన్స్ తో చాల సులభంగా పేజీలను తిరగేయవచ్చు. ఈ Kindle Oasis యొక్క ప్రీ ఆర్డర్లను అమెజాన్ ఇండియా మొదలు పెట్టింది. అయితే, ఈ డివైజ్ యొక్క తరలింపు (Shipment ) మాత్రం ఆగష్టు 19 వ తేది నుండి మొదలవుతుంది.