అమెజాన్ సైట్ లో దర్శనమిచ్చిన JioEV Aries ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్.!

HIGHLIGHTS

JioEV Aries ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ అమెజాన్ ఇండియా నుండి లిస్ట్ చేయబడింది

రిలయన్స్ జియో కొత్త ప్రోడక్ట్ తో ముందుకు వచ్చింది

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ కోసం తగిన మరియు అనుకూలమైన కాంపాక్ట్ ఛార్జర్ ని జియో అందించింది

అమెజాన్ సైట్ లో దర్శనమిచ్చిన JioEV Aries ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్.!

JioEV Aries ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ అమెజాన్ ఇండియా నుండి లిస్ట్ చేయబడింది. దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా కొనసాగుతున్న రిలయన్స్ జియో కొత్త ప్రోడక్ట్ తో ముందుకు వచ్చింది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కి భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ కోసం తగిన మరియు అనుకూలమైన కాంపాక్ట్ ఛార్జర్ ని జియో అందించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ అందిరికి అందుబాటులో ఉండేలా అమెజాన్ ద్వారా అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JioEV Aries: ఫీచర్లు

జియో తీసుకు వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ని యూనివర్సల్ టైప్ 2 ఛార్జింగ్ కనెక్టర్ తో అందించింది. ఇది టాటా నెక్సాన్, టియాగో, పంచ్, మహీంద్రా XUV400, హ్యుందాయ్ ఐయానిక్, Kia EV6 మరియు లేటెస్ట్ గా వచ్చిన అన్ని హైబ్రిడ్ కార్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ లో అందించిన ఇంటర్నల్ RCD తో షార్ట్ సర్క్యూట్, ఓవర్ కరెంట్, ఓవర్ టెంపరేచర్, ఓవర్ ఓల్టేజ్ వంటి వాటి నుంచి రక్షణ ఉంటుంది.

JioEV Aries
JioEV Aries

ఇది 7.4 kW ఫాస్ట్ ఛార్జ్ తో వస్తుంది, వెహికల్ ఆన్ బోర్డ్ ఛార్జింగ్ కెపాసిటీ బట్టి వెహికల్ ను చాలా త్వరగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఛార్జర్ IP55 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ మరియు IK10 ఇంపాక్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది మరియు ఎక్కువ కాలం మన్నిక అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ జియో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ను లోకల్ ఎలక్ట్రీషియన్ తో కూడా ఈజీగా సెటప్ చేసుకోవచ్చని కూడా చెబుతోంది. ఈ ఛార్జర్ Jio TruePower App తో వస్తుంది మరియు చాలా స్మార్ట్ ఫీచర్ లను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Xiaomi Air Fryer 6L: ఎక్కువ కెపాసిటీతో కొత్త ఎయిర్ ఫ్రైయర్ లాంచ్ చేసిన షియోమీ.!

JioEV Aries: ప్రైస్

జియో ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ని రూ. 46,499 రూపాయల ధరతో అమెజాన్ నుండి లిస్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ పైన No Cost EMI ఆఫర్ ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ జియో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్ ను నేరుగా కొనుగోలు చేయాలనుకునే వారు Buy From Here లింక్ పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo