జియో VS ఎయిర్టెల్ : FREE సెటాప్ బాక్స్ మరియు LED టీవీ ఆఫర్లు
ప్రస్తుతం బ్రాండ్ బ్యాండ్ మరియు సెటాప్ బాక్సులలో కూడా మరిన్ని మార్పులు చోటుచేసుకొనునట్లు కనబడుతోంది.
ఇప్పుడు టెలికం రంగం నుండి పోటీ సెటాప్ బాక్సులు మరియు బ్రాండ్ బ్యాండ్ సర్వీసులను చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా, జియో తన ఫైబర్ సేవలను మరియు ఉచిత ఆఫర్లను ప్రకటించగా, భారతీ ఎయిర్టెల్ కూడా పోటాపోటీగా తన కొత్త బ్రాండ్ బ్యాండ్ మరియు ఉచిత ఆఫర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అంటే, ఎయిర్టెల్ సంస్థ, ఇప్పుడు జియో గిగా ఫైబర్ కి కూడా పోటీగా తన సేవలను అందించాడని సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది.
Surveyఇటీవల, తన వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM ) లో రిలయన్స్ జియో, తన జియోఫైబర్ ఇంటర్నెట్ సర్వీసును వాణిజ్యపరంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు, ఇంటర్నెట్ సర్వీస్ యొక్క వార్షిక ప్రణాళికకు సభ్యత్వం పొందిన వారందరికీ ‘Freebie ’ అని పిలిచే ఒక ప్రణాలికను కూడా ప్రకటించింది. సంస్థ యొక్క వార్షిక ప్రణాళికలను ఎంచుకునే జియోఫైబర్ కస్టమర్లకు HD లేదా 4 K LED టెలివిజన్ మరియు 4 K సెట్-టాప్-బాక్స్ కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా, ఎయిర్టెల్ కూడా జియో కి పోటీగా ఇలాంటి ప్లాన్స్ మరియు ఆఫర్లను తీసుకురానుట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎయిర్టెల్ పోస్ట్ పైడ్ సబ్ స్క్రిప్షన్, హోమ్ బ్రాడ్ బ్యాండ్ మరియు DTH వంటి వాటిని కలగలిపిన ఒక గ్రూప్ ప్లాన్లను అందించాడని, టెస్టింగ్ చేస్తోంది. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు చండీగఢ్ వంటి రాష్ట్రాలలో దీని పరిక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ సర్వీసుల యొక్క వార్షిక చందాదారుల కోసం ఉచితంగా ఆండ్రాయిడ్ – ఆధారితమైన సెటాప్ బాక్స్ మరియు HD LED టీవీలు కూడా అందచేయనున్నట్లు కనిపిస్తోంది. అయితే, టీవీని మాత్రం ప్రీమియం ప్లాన్ ఎంచుకునే చందాదారులకు ఇవ్వనుంది. ఎయిర్టెల్ యొక్క ఈ ఆండ్రాయిడ్ సెటాప్ బాక్స్, OTT స్ట్రీమింగ్ సర్వీసులు మరియు మ్యూజిక్, గేమింగ్ తో పాటుగా మరిన్ని ప్రజానాలను అందించనుంది. జియో తన గిగా ఫైబర్ సర్వీసులను సెప్టెంబర్ 5 న ప్రారంభిస్తుండగా, ఎయిర్టెల్ కూడా సెప్టెంబర్ నెల చివరికల్లా ఈ సర్వీసులను తీసుకురానున్నట్లు అంచనావేస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే, ప్రస్తుతం బ్రాండ్ బ్యాండ్ మరియు సెటాప్ బాక్సులలో కూడా మరిన్ని మార్పులు చోటుచేసుకొనునట్లు కనబడుతోంది. ఎందుకంటే, ఈ సెటాబాక్సులు ఆండ్రాయిడ్ అనుసంధానంతో వస్తాయి కాబట్టి మీ పాత టీవీని కూడా ఒక స్మార్ట్ టీవీ లాగా మార్చేస్తాయి. వీటి సహాయంతో నేరుగా అన్ని వీడియో స్ట్రీమింగ్ లను పొందవచ్చు మరియు ప్లే స్టోర్ లోని అప్స్ మరియు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అయితే, పూర్తిగా ధరలను నిర్ణయించే వరకూ ఈ సర్వీసులు ఇవి చౌకగా ఉండనున్నాయా లేక భారం కానున్నాయా అనేది తేలుచుకోలేము.