94 రూపాయలకే జియో రౌటర్!! ఉచిత డేటా, రీఛార్జ్ ఆఫర్లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 Apr 2021
HIGHLIGHTS
  • JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్

  • నెలకు 94 రూపాయల అతితక్కువ EMI

  • 5 నెలల ఉచిత డేటా

94 రూపాయలకే జియో రౌటర్!! ఉచిత డేటా, రీఛార్జ్ ఆఫర్లు
94 రూపాయలకే జియో రౌటర్!! ఉచిత డేటా, రీఛార్జ్ ఆఫర్లు

జియో సంస్థ JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ప్రకటించింది. ఇది బెస్ట్ అఫర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే, కేవలం నెలకు 94 రూపాయల అతితక్కువ EMI చెల్లించి జియో రౌటర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.  రూ.1,999 విలువగల JioFi ని  నెలకు కేవలం రూ. 94 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.  అంతేకాదు, ఇతర రీఛార్జ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

JioFi 4G తో 5 నెలల వరకూ ఉచిత డేటా ఆఫర్

JiioFi 4G హాట్ స్పాట్ డివైజ్ కొనేవారికి 5 నెలల ఉచిత డేటా మరియు జియో-టు-జియో  ఉచిత కాల్స్ కూడా అందిస్తోంది. ఈ JioFi 4G ధర కేవలం 1,999 రూపాయలు మాత్రమే. అయితే, ఈ ఉచిత అఫర్ పొందడానికి, వినియోగదారులు మొదట JioFi 4G కోసం ఈ క్రింది ప్లాన్లలో ఒక  దాన్ని రీఛార్జ్ చేయాలి.

JiioFi 4G తో ఉచిత డేటా అఫర్ ఎలా జతచేయాలి?

రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి JioFi 4G Hot Spot ‌ను కొనుగోలు చేసి, ఆపై జియో సిమ్ ‌ను యాక్టివేట్ చేసిన తరువాత, వినియోగదారులు డివైజ్ ని ఎనేబుల్ చేయడానికి అందుబాటులో ఉన్న మూడు కొత్త జియోఫీ ప్లాన్‌ లలో దేనినైనా ఎంచుకోవచ్చు. యాక్టివ్ సిమ్ ‌ను JioFi 4G  పరికరంలో చేర్చిన తర్వాత ఎంచుకున్న ప్లాన్ తో పాటుగా ఉచిత డేటా కొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ యొక్క యాక్టివ్ స్టేటస్ ని MyJioApp ద్వారా తనిఖీ చేయవచ్చు. JioFi 4G  Device ని కంపెనీ సైట్ ద్వారా ఆన్‌ లైన్ ‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

మొదటి ప్లాన్: రూ. 199 ప్లాన్

ఇది ప్రతిరోజూ 1.5 జిబి డేటాను అందిస్తుంది. మరియు ఇది 28 రోజులు చెల్లుతుంది. మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వాన్ని 99 తో జోడించవచ్చు. ఇందులో ప్రతిరోజూ 1.5 జిబి ఉచిత డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్స్ కోసం 28 రోజులకు 1000 నెట్ ‌వర్క్ నిమిషాలు మరియు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్ 140 రోజుల వరకూ అందిస్తుంది. అంటే, 5 నెలల వరకూ ఉచితంగా ఇస్తుందన్న మాట.    

రెండవ ప్లాన్: రూ .249 ప్లాన్

ఇది ప్రతిరోజూ 28 రోజుల పాటు 2 జిబి డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వం 99 ను కూడా రీఛార్జ్ చేయాలి. దీనితో, మీకు రోజుకు 2GB డేటా జియో నుండి జియో అపరిమిత కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కోసం 1000 నిమిషాలు 28 రోజుల కోసం మరియు డైలీ 100 జాతీయ SMS లను 112 రోజుల వరకూ అందిస్తుంది.

మూడవ ప్లాన్: రూ. 349 ప్లాన్

ఇది  రోజూ 3 GB డేటాని 28 రోజులు వ్యాలిడిటీతో అందిస్తుంది. ఇక్కడ మీరు అదనపు జియో ప్రైమ్ సభ్యత్వం 99 ను కూడా యాక్సెస్ చేయాలి. దీనితో, మీకు రోజుకు 3GB డేటా జియో నుండి జియో అపరిమిత కాల్స్,  జియో నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్ కోసం 1000 నిమిషాలు 28 రోజుల కోసం మరియు డైలీ 100 జాతీయ SMS లను 84 రోజుల వరకూ అందిస్తుంది.

Note: మరిన్ని Jio Best Plans కోసం ఇక్కడ నొక్కండి.  

logo
Raja Pullagura

email

Web Title: jio roter available with lowest emi and best recharge plans also available
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status