రూ.2,000 భారీ డిస్కౌంట్ తో JioPhone Next సేల్ .. ఎక్కడంటే..!!

రూ.2,000 భారీ డిస్కౌంట్ తో JioPhone Next  సేల్ .. ఎక్కడంటే..!!
HIGHLIGHTS

JioPhone Next 4G స్మార్ట్ ఫోన్ 2,000 డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది

ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది

ఇప్పుడు JioPhone Next 4G స్మార్ట్ ఫోన్ 2,000 డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. రిలయన్స్ జియో మరియు గూగుల్ జతగా ప్రకటించిన ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను చాలా చవక ధరకే పొందాని చూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఈ ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ మరియు జియో అధికారిక వెబ్సైట్ నుండి వేరు వేరు ఆఫర్లతో లభిస్తోంది. ఎక్స్ చేంజ్ అఫర్ క్రింద మంచి డిస్కౌంట్ తో జియో వెబ్సైట్ ద్వారా అఫర్ చేస్తూంటే, అమెజాన్ మాత్రం 39% డిస్కౌంట్ తో కేవలం రూ.4,479 రూపాయల అఫర్ ధరకే సేల్ చేస్తోంది.

అంతేకాదు, ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 1,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here  

ఇక జియో వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా 4G ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, JioPhone Next కేవలం రూ.4,499 రూపాయలకే లభిస్తుంది. అంతేకాదు, నెలవారీ EMI పద్దతిలో ఎంచుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో ఈజీ EMI ద్వారా కూడా చెల్లించవచ్చు. 

JioPhone Next: స్పెక్స్

ఇక JioPhone Next ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ 5.45-అంగుళాల HD(720×1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్  LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ కెమెరా HDR Mode, Night Mode, Portrait వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo