JIO వారి కొత్త 350GB 4G డేటా ప్లాన్

JIO  వారి  కొత్త 350GB 4G డేటా  ప్లాన్
HIGHLIGHTS

ఈ ప్లాన్ క్రింద 350GB 4G డేటా ను పొందవచ్చు

jio  వారి  కొత్త 350GB 4G డేటా  ప్లాన్ 

రిలయన్స్  jio  తన   4G సేవలను  ప్రారంభించిన  తరువాత  భారతీయ  టెలికాం  మార్కెట్ లో  అనేక  మార్పులు  చోటు  చేసుకున్నాయి. రిలయన్స్ jio  నుంచి  తమ  యూజర్స్   వెనక్కి  లాగేటందుకు  మిగతా  టెలికాం  సంస్థలు  అనేక  రకాల  ఆఫర్స్  తో  ఫీట్లు  చేశాయి. అయితే బాధాకరమైన విషయం  ఈ నెల  31 తో jio  ఉచిత  సేవలు  ముగుస్తాయి.  ఈ సర్వీసెస్ లో కంటిన్యూ  అవ్వటానికి డబ్బు  చెల్లించాలిసి  ఉంటుంది.  

jio  తన  ప్రైమ్  మెంబర్షిప్  ప్లాన్  ను లాంచ్  చేసింది. దీనికోసం  యూజర్   మొదట  99 రూ  చెల్లించవలిసి  ఉంటుంది. మరియు  దీనితో  పాటుగా ప్రతినెలా  రీఛార్జి  చేసుకోవాలిసి  ఉంటుంది. అయితే  ఇప్పుడు  లేటెస్ట్  గా  jio  ఒక  కొత్త ప్లాన్  ను  విడుదల  చేసింది. ఈ ప్లాన్  క్రింద 350GB 4G డేటా ను పొందవచ్చు.  మరియు దీనియొక్క  ధర 4,999 ఉంటుందని  సమాచారం . దీనితో  పాటు  అన్లిమిటెడ్  వాయిస్  కాల్స్  మరియు  మెసేజెస్  jio యాప్  సౌకర్యం వంటివన్నీ  పొందవచ్చు. దీనియొక్క  వాలిడిటీ 180 రోజులు . 
ఈమధ్యనే జియో  999 రూ  గల  ప్లాన్  ని  ప్రవేశ  పెట్టింది. ఈ ప్లాన్  లో యూజర్స్  కి 60GB 4G డేటా  మరియు అన్లిమిటెడ్  వాయిస్  కాల్స్ మరియు  మెసేజెస్  jio  యాప్  సౌకర్యం వంటివన్నీ  పొందవచ్చు.  ఈ ప్యాక్  యొక్క వాలిడిటీ 60 రోజులు.  ఈ ప్యాక్  యొక్క  సర్వీసెస్  ను పొందటానికి  యూజర్స్  దగ్గర  ప్రైమ్ మెంబర్షిప్  ఉండి తీరాలి . 

Lenovo Power Bank PB410 5000mAh – Silver, అమెజాన్ లో 946 లకు కొనండి

Intex IT-PB11K 11000mAH Power Bank (Black), అమెజాన్ లో 929 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo