ఈ దీపావళి పండుగకు Jio గుడ్ న్యూస్ ఇవ్వనుందా..!

HIGHLIGHTS

Jio ధమాకా గిఫ్ట్ ఇవ్వనుందా

దీపావళి సంద్భరంగా జియోఫోన్ నెక్స్ట్ రావచ్చని అంచనా వేస్తున్నారు

JioPhone Next కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్

ఈ  దీపావళి పండుగకు Jio గుడ్ న్యూస్ ఇవ్వనుందా..!

ఈ  దీపావళి పండుగకు Jio ధమాకా గిఫ్ట్ ఇవ్వనుందా? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఎందుకంటే, ఇటీవల ప్రకటించిన JioPhone Next బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ముందుగా సెప్టెంబర్ 10 నుండి మార్కెట్లో అమ్మకాలను కొనసాగిస్తుందని ఊహించారు. కానీ ఆ విధంగా జరగలేదు. అయితే,  2021 దీపావళి సంద్భరంగా జియోఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. కంపెనీ ఇప్పటికే తన రిటైల్ పాట్నర్స్ చర్చలు ప్రారంభించిందని మరియు కొద్దీ రోజుల్లోనే రిటైలర్లతో మరింత సమాచారాన్ని పంచుకుంటుందని కూడా రూమర్లు వస్తున్నాయి. ఇదే నిజమైతే, JioPhone Next కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఈ దీపావళి పండుగకు Jio తీసుకొచ్చే గుడ్ న్యూస్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక గతంలో వచ్చిన అనేక రూమర్ల ద్వారా JioPhone Next ధర రూ. 3,499 కావచ్చని వెల్లడించారు. ఇప్పుడు ఈ ఫోన్ అమ్మకం నవంబర్ నెలలో ప్రారంభమవుతుందని ఊహిస్తున్నారు. ముందుగా వచ్చిన లీక్స్ కూడా ఈ ఫోన్ ధర రూ.3,500 నుండి రూ.4,500 మధ్యస్థంగా ఉండవచ్చని సూచించాయి.

JioPhone Next: స్పెక్స్

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ గురించి ఆన్లైన్లో వచ్చిన అనేకమైన లీక్స్ ద్వారా ఈ ఫోన్ 5.5-అంగుళాల HD డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు  Qualcomm QM215 చిప్‌సెట్‌తో రావచ్చు. అలాగే, ఈ ఫోన్ 2GB లేదా 3GB RAM తో రావచ్చు మరియు ఇది 16GB లేదా 32GB eMMC 4.5 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది. జియోఫోన్ నెక్స్ట్ 13 MP స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుందని కూడా ఊహిస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo