జియో గిగా ఫైబర్ VS ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ : ఏది బెస్ట్
రెండింటి యొక్క సర్వీస్, ధర మరియు ఫీచర్ల మధ్య పోలికలు.
రాబోయే రిలయన్స్ జియో గిగా ఫైబర్ 4 కె సెట్-టాప్ బాక్స్‌తో పోటీ పడటానికి ఎయిర్టెల్ తన కొత్త ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను విడుదల చేసింది. జియో గిగా ఫైబర్ సెప్టెంబర్ 5 న అంటే ఈరోజు లాంచ్ కానుండగా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను ముందుగానే ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ యొక్క ఈ ప్రణాళిక జియో గిగా ఫైబర్‌తో పోటీ పడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.
Surveyజియో మరియు ఎయిర్టెల్ రెండు సమస్థలు కూడా వాటి సెట్-టాప్ బాక్స్ గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని తెలియపరచలేదు, కానీ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ఆధారంగా, మేము రెండింటి యొక్క సర్వీస్, ధర మరియు ఫీచర్ల మధ్య పోలికలు చేస్తున్నాము.
వీడియో కాలింగ్
జియో గిగాఫైబర్ వినియోగదారులకు 4 కె సెట్-టాప్ బాక్స్ తో ఇవ్వబడుతుంది మరియు సంస్థ ప్రకారం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 4 మంది వరకు కలిసి మాట్లాడటానికి ఇది అనుమతిస్తుంది. ఎక్స్‌స్ట్రీమ్ సెట్-టాప్ బాక్స్ విషయానికి వస్తే, ఇది వీడియో కాల్ ఫీచర్ గురించి ఇంకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
వినోదం
ఇక వినియోగదారులకు అందనున్న వినోదం గురించి మాట్లాడితే, ఈ రెండు కంపెనీలు దీనిని దృష్టిలో ఉంచుకుని తమ బాక్స్ లలో అనేక ఫీచర్లను చేర్చాయి. జియో గిగా ఫైబర్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రెండూ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మొదలైన OTT యాప్ లకు ఉచిత యాక్సెస్ ఇస్తున్నాయి. సెట్-టాప్ బాక్స్‌లలో మరిన్ని ఛానెల్‌లను అందించడానికి జియో హాత్వే మరియు డెన్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అదేవిధంగా ఎయిర్టెల్ 500 కి పైగా టీవీ ఛానెళ్లను కూడా వినియోగదారులకు అందిస్తోంది.
గేమింగ్
జియో యొక్క సెట్-టాప్ బాక్స్ ఆన్లైన్ మలాటి-ప్లేయర్ గేమింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండగా, ఎయిర్టెల్ గేమింగ్ ఫీచర్‌ను ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో కూడా కలిగి ఉంది, అయితే ఇది ఆన్లైన్ మల్టీ-ప్లేయర్ గేమింగ్‌కు మద్దతు ఇవ్వదు.
ధర
ఇక ధర విషయానికి వస్తే, జియో గిగా ఫైబర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు ఉచిత 4 కె సెట్-టాప్ బాక్స్ కూడా అందించబడుతుంది. ప్రారంభంలో, వినియోగదారులు దీని కోసం ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, వాపసు ఇవ్వబడే రౌటర్ కోసం యూజర్ రూ .2,500 జమ చేయాలి. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ను 3,999 రూపాయలకు లాంచ్ చేశారు. ఎయిర్టెల్ యొక్క ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో, వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత చందా లభిస్తుంది, దీని విలువ 999 రూపాయలుగా ఉంటుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులందరూ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌కు రూ .2,249 ప్రత్యేక ధర వద్ద అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.