జియో జబర్దస్త్ అఫర్: ఈ ప్లాన్స్ తో డిస్నీ+ హాట్ స్టార్ 4K యాక్సెస్ ఫ్రీ
జియో కస్టమర్ల కోసం జబర్దస్త్ అఫర్
డిస్నీ+ హాట్ స్టార్ 4K కంటెంట్ ఉచితంగా చూడవచ్చు
డైలీ అధిక డేటా మరియు మరిన్ని లాభాలను కూడా తీసుకువస్తాయి
జియో తన కస్టమర్ల కోసం జబర్దస్త్ అఫర్ తీసుకొచ్చింది. OTT లో 4K కంటెంట్ చూడలనుకునే వారికి ఇది నిజంగా గొప్ప వార్త. ఇటీవల తీసుకొచ్చిన రూ.1,499 మరియు రూ.4,199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ తో డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం (4K యాక్సెస్) సబ్ స్క్రిప్షన్ ను జత చేసింది. అంటే, ఈ రెండు ప్లాన్స్ కూడా రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ అధిక డేటా మరియు మరిన్ని లాభాలను కూడా తీసుకువస్తాయి.
SurveyJio Rs.1,499 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అలాగే,రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుతుంది.
Jio Rs.4,199 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, ఈ రీఛార్జ్ ద్వారా 200 రూపాయల జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను మరియు రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile