Reliance Jio: ఇలాంటి JIO అఫర్ చూసివుండరు

HIGHLIGHTS

ఇప్పటి వరకూ ఇలాంటి JIO అఫర్ చూసివుండరు

Jio మరొకసారి బంపర్ అఫర్ ప్రకటించింది

రూ.47 కే JioFi 4G Wi Fi హాట్ స్పాట్

Reliance Jio: ఇలాంటి JIO అఫర్ చూసివుండరు

Jio మరొకసారి బంపర్ అఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఇలాంటి JIO అఫర్ చూసివుండరు. లాక్ డౌన్ కారణముగా ఇంటి నుండి పనులను చేసే వారి సంఖ్య పెరిగింది. అంతేకాదు, పిల్లల ఆన్లైన్ క్లాసులతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఇంటర్నెట్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందుకే, అందరికి వేరువేరుగా కాకుండా కనెక్టివిటీ కోసం WiFi నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు. ఇది కేవలం 47 రూపాయలకే లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ  EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా  EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది.   అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo