జియో జబర్దస్త్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Aug 2021
HIGHLIGHTS
  • కొత్త 4G ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త

  • జియో 4G ఫోన్ ఉచితంగా లభిస్తుంది

  • ఉచిత జియోఫోన్ ఇలా పొందండి

జియో జబర్దస్త్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం
జియో జబర్దస్త్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం

కొత్త 4G ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఎందుకంటే, రిలయన్స్ జియో మంచి లాభాలను తీసుకొచ్చే జియోఫోన్ 2021 ఆఫర్ ను రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్ మరియు ఉచిత జియోఫోన్ తో ప్రకటించింది. ఇప్పటికీ 2G వాడుతున్న వినియోగదారులకు 4G సర్వీస్ ను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ అఫర్ విడుదల చేసినట్లు జియో పేర్కొంది.

కొత్త జియోఫోన్ కోనాలనుకునే వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, రెండు సంవత్సరాల రీఛార్జ్ ఒకేసారి చేస్తే జియో 4G ఫోన్ ఉచితంగా లభిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం కూడా మంచి ప్లాన్ ని అందించింది.ఈ అఫర్ విశేషాలు ఏమిటో చూద్దాం.

జియోఫోన్ 2021 ఆఫర్

అతిపెద్ద  టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

పైన తెలిపిన ఈ ప్రయోజనాలలతో  కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ప్రయోజనాలను కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.   

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio august 2021 best offer with 2 year unlimited services
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
₹ 15499 | $hotDeals->merchant_name
HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
ah arctic hunter Anti-Theft 15.6 inches Water Resistant Laptop Bag/Backpack with USB Charging Port and for Men and Women (Black)
ah arctic hunter Anti-Theft 15.6 inches Water Resistant Laptop Bag/Backpack with USB Charging Port and for Men and Women (Black)
₹ 2699 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status