మళ్ళీ తెరపైకి జియో 5G ఫోన్: BIS సర్టిఫికేషన్ సైట్ లో దర్శనమిచ్చిన ఫోన్.!
BIS సర్టిఫికేషన్ లో లిస్టింగ్ చేయబడిన జియో 5G ఫోన్
త్వరలోనే జియో కొత్త ఫోన్ మర్కెట్ లోకి లాంచ్ కాబోతోంది
జియో 5G ఫోన్ త్వరలోనే మార్కెట్ లో అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు
రిలయన్స్ జియో ఫోన్ ను తీసుకువస్తున్నట్లు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. Jio 5G సర్వీస్ తో పాటుగా 5G ఫోన్ ను కూడా కంపెనీ అందించడానికి చూస్తున్నట్లు చాలా కాలంగా మనం వార్తల్లో చూస్తూ వస్తున్నాము. అయితే, ఇప్పుడు ఈ మాటలు నిజమే అని నిరూపించే ఒక కొత్త అప్డేట్ బయటికి వచ్చింది. కొత్త ప్రోడక్ట్స్ క్వాలిటీ సర్టిఫికేషన్ ను అందించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ సైట్ లో జియో కొత్త ఫోన్ లిస్టింగ్ చెయ్యబడింది. అంటే దీనర్ధం, త్వరలోనే జియో కొత్త ఫోన్ మర్కెట్ లోకి లాంచ్ కాబోతోంది. BIS సర్టిఫికేషన్ లో లిస్టింగ్ చేయబడిన జియో ఫోన్ వివరాలు ఏమిటో చూద్దామా.
Surveyఇప్పుడు Jio ఫోన్ 5G బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను పొందింది. RIL ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జియో ఫోన్ ఉనికిని ఇప్పటికే ధృవీకరించారు. తద్వారా, జియో 5G ఫోన్ త్వరలోనే మార్కెట్ లో అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ Jio LS1654QB5 తో ఫోన్ జాబితా చేయబడింది. ఇది బడ్జెట్ ఫోన్ కావచ్చని మరియు 4GB RAM తో రావచ్చని ఈ జాబితా సూచిస్తుంది.
గీక్‌బెంచ్ జాబితాలో ఈ ఫోన్ కనిపించిన కొద్ది రోజులకే అప్ కమింగ్ జియో ఫోన్ 5G ఫోన్ గురించి కంపెనీ ఆమోదం తెలిపింది. అంటే, ఈ విషయాలన్ని కూడా జియో 5G ఫోన్ విడుదల సమయం ఆసన్నమైందని సూచిస్తున్నాయి. అయితే, రిలయన్స్ జియో తదుపరి రిలయన్స్ AGM ఈవెంట్‌లో మాత్రమే ఈ సరికొత్త జియో ఫోన్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.
జియో 5G ఫోన్: (లీకైన స్పెక్స్)
ఇక గతంలో వచ్చిన రూమర్లు మరియు లీకైన వివరాల ప్రకారం, జియోఫోన్ 5జి క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చు. JioPhone 5G వెనుక 13-మెగాపిక్సెల్ ప్రైమరీ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉండవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile