జయమ్మ పంచాయతీ OTT రిలీజ్ .. ఎప్పుడంటే..!!
'జయమ్మ పంచాయతీ' OTT లో విడుదల అవనునట్లు తెలుస్తోంది
ఈ హై డ్రామా మూవీ పలువురి ప్రశంసలు అందుకుంది
సినిమా థియేటర్లలో చూడలేక పోయామనే వారు ఈ సినిమాను OTT లో చూడవచ్చు
ప్రముఖ యాంకర్ సుమ కనకాల అంటే తెలియనిది ఎవరికి? ఆమే పంచాయతీ, అదేనండి 'జయమ్మ పంచాయతీ' సినిమా గురించి గురించి కూడా అందరికీ తెలుసు. మే 6 న సినిమా థియేటర్లలో విడుదలై మంచి పేరుతెచ్చుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. అయినా కూడా ఈ సినిమా గురించి అంతటా సుమ చర్చే ఎక్కువగా కొనసాగింది. ఇప్పుడు ఈ సినిమా OTT లో విడుదల అవనునట్లు తెలుస్తోంది. ఈ సినిమా OTT రైట్స్ ను అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Surveyబలగ ప్రకాశ్ నిర్మాతగా కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై డ్రామా మూవీ పలువురి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా, సుమ కనకాల నటన ఈ చిత్రానికి ప్రాణం పోసినట్లు పలువురు ప్రముఖులు కితాబు పలికారు. ఈ సినిమాలో దినేష్ మరియు షాలినీ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే కథ మొత్తంగా గ్రామీణ వాతావరణంలోనే సాగుతుండడమే కాకుండా కావాలి;కావాల్సినంత కామెడీ మరియు డ్రామా ఈ సినిమాలో చూడవచ్చు.
ఇక కథ విషయానికి వస్తే, శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో హాయిగా జీవించే ఒక సగటు కుటుంబంలో కుటుంబ పెద్ద (జయమ్మ భర్త) కి హఠాత్తుగా జబ్బు చేయడంతో జరిగే పరిణామాలు గురించి చెబుతుంది ఈ సినిమా. తన భర్త కోసం జయమ్మ(సుమ) పంచాయితీ పెద్దలను ఆశ్రయిస్తుంది. ఆతరువాత ఏమిజరిగింది అనేది ఈ చిత్రం. సినిమా థియేటర్లలో చూడలేక పోయామనే వారు ఈ సినిమాను OTT లో చూడవచ్చు. 'జయమ్మ పంచాయతీ' మూవీ జూన్ 14 నుండి OTT లో స్ట్రీమ్ కావచ్చని తెలుస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile