iQOO Z6 Pro: అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ అఫర్ తో పొందండి..!!

HIGHLIGHTS

iQOO Z6 Pro అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది

అమెజాన్ 1,000 రూపాయల కూపన్ అఫర్

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జతచేసింది

iQOO లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Pro అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు Z స్నాప్ డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి చాలా ఫీచర్లతో వచ్చింది. అయితే, రీసెంట్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ 1,000 రూపాయల కూపన్ అఫర్ తో పాటుగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జతచేసింది. మరి అమెజాన్ నుండి లభిస్తున్న ఆ ఆఫర్లు మరియు ఫోన్ వివరాలను గురించి తెలుసుకుందాం.            

iQOO Z6 Pro: ధర

ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను రూ.23,999 రూపాయల ధరతో ప్రకటించింది. అలాగే, 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.28,999 గా ప్రకటించింది.

iQOO Z6 Pro: ఆఫర్లు

అమెజాన్ నుండి ఈ ఫోన్ పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ICICI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి 2,000, Non-EMI ట్రాన్సాక్షన్ పైన 1,500 డిస్కౌంట్ ను పొందుతారు. Buy From Here         

iQOO Z6 Pro: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.44 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 2100 mm² వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ కెమెరా మరియు 4cm మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, Z6 ప్రో 4D లీనియర్ వైబ్రేషన్ మోటార్ ని జతచేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :