iQOO 9 Series పైన ఈరోజుతో ముగియనున్న లాంచ్ ఆఫర్లు ..త్వరపడండి!!

HIGHLIGHTS

iQOO 9 Series స్మార్ట్ ఫోన్ల పైన ఈరోజుతో ముగియనున్న లాంచ్ ఆఫర్లు

QOO ఈ కొత్త ఫోన్లను మంచి లాభదాయకమైన ఆఫర్లతో ప్రకటించింది

ఈ ఆఫర్లు రేపటి నుండి అంధుబాటులో ఉండవు

iQOO 9 Series పైన ఈరోజుతో ముగియనున్న లాంచ్ ఆఫర్లు ..త్వరపడండి!!

ఐకూ ఇటీవల ఇండియాలో ప్రకటించిన లేటెస్ట్ iQOO 9 Series స్మార్ట్ ఫోన్ల పైన ఈరోజుతో ముగియనున్న లాంచ్ ఆఫర్లు. iQOO ఈ కొత్త ఫోన్లను మంచి లాభదాయకమైన ఆఫర్లతో ప్రకటించింది. అయితే, ఆఫర్లను అందుకోవడానికి ఈ రోజుతో మాత్రమే అవకాశం వుంది. ఎందుకంటే, ఈ ఆఫర్లు రేపటి నుండి అంధుబాటులో ఉండవు. ఈ ఐకూ 9 సిరీస్ నుండి మూడు ఫోన్లను ప్రకటించింది. ఈ ఫోన్లు అన్ని కూడా హై ఎండ్ ఫీచర్లతో వచ్చాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO 9 Series: ధర మరియు ఆఫర్లు

iQOO 9 SE:

iQOO 9 SE స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో లభించే తక్కువ ధర ఫోన్ మరియు  అమెజాన్ మరియు iQOO నుండి లభిస్తుంది. ఈ ఫోన్ పైన 3,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, ఎక్స్ చేంజ్ అఫర్  మరియు No Cost EMI అప్షన్ కూడా వున్నాయి. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

(8GB + 128GB) వేరియంట్ ధర   : రూ.33,990

(12GB + 256GB) వేరియంట్ ధర : రూ.37,990

iQOO 9:

iQOO 9 స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో లభించే మధ్యస్థ ధర ఫోన్ మరియు అమెజాన్ మరియు iQOO నుండి లభిస్తుంది. ఈ ఫోన్ పైన 6,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, ఎక్స్ చేంజ్ అఫర్  మరియు No Cost EMI అప్షన్ కూడా వున్నాయి. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.            

(8GB + 128GB) వేరియంట్ ధర   : రూ.42,990

(12GB + 256GB) వేరియంట్ ధర : రూ.46,990         

iQOO 9 Pro:

iQOO 9 Pro స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు భారీ ఫీచర్లతో కూడా ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు iQOO నుండి లభిస్తుంది. ఈ ఫోన్ పైన 6,000 రూపాయల వరకూ ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అలాగే, ఎక్స్ చేంజ్ అఫర్  మరియు No Cost EMI అప్షన్ కూడా వున్నాయి. ఈ ఫోన్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.               

(8GB + 256GB) వేరియంట్ ధర   : రూ.64,990

(12GB + 256GB) వేరియంట్ ధర : రూ.69,990

ఈ ఫోన్లను అమెజాన్ నుండి కొనుగోలు చెయ్యవచ్చు. ఇప్పటికే కొనసాగుతున్న iQOO కస్టమర్లు లోయల్టి ప్రోగ్రామ్ ద్వారా వారి పాత ఐకూ స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ తో 10,000 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. iQOO 9 స్మార్ట్ ఫోన్ ఫీచర్లను ఈ క్రింద చూడవచ్చు.

iQOO 9: స్పెక్స్

iQOO 9 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్  కలిగిన 6.56-అంగుళాల 10-బిట్ AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగివుంది. ఇది HDR10+  కి సపోర్ట్ చేస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 + UFS 3.1కాన్ఫిగరేషన్ కలిగిన 12GB ర్యామ్ మరియు స్టోరేజ్ 256 అప్షన్ లను అందిస్తుంది.ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12  స్కిన్ పైన నడుస్తుంది.

కెమెరా విభాగంలో, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 13MP 50mm ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో పాటు 48MP IMX 598 సెన్సార్‌తో గల రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 16MP లెన్స్‌ ఉంటుంది. ఇందులో, Gimbal స్టెబిలైజేషన్ సెటప్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 4,350mAh బ్యాటరీని ప్యాక్‌ చేస్తుంది మరియు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo