భారత ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి ఒక స్మార్ట్ ఫోన్ యాప్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.

భారత ప్రభుత్వం  కరోనా వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి ఒక స్మార్ట్ ఫోన్ యాప్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.
HIGHLIGHTS

ఈ ఆప్లికేషన్ వినియోగదారు ట్రావెలింగ్ హిస్టరీని రికార్డ్ చేస్తుంది.

కరోనా వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం ఒక స్మార్ట్ ఫోన్ యాప్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ అప్లికేషన్ CoWin -20 అని పిలువబడుతుంది మరియు ప్రస్తుతం iOS మరియు Android ఫోన్ల కోసం విదుహాల్ చెయ్యడానికి ముందు జరిపే బీటా పరీక్షలో ఉంది.

నెట్‌వర్క్ 18 యొక్క నివేదిక ప్రకారం, CoWin -20 అప్లికేషన్ ప్రజలను ట్రాక్ చేయడానికి మరియు కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి స్మార్ట్‌ ఫోన్ లొకేషన్ సర్వీస్ పైన ఆధారపడుతుంది. ప్రజలు వైరస్ ను పట్టుకునే ప్రమాదం ఉందా లేదా వారు సంప్రదించిన వ్యక్తులను గుర్తించడానికి వీలుగా ఈ ఆప్లికేషన్ వినియోగదారు ట్రావెలింగ్ హిస్టరీని రికార్డ్ చేస్తుంది.

Cowin-20-coronavirus-Indian-government-app.jpg

ఈ ఆప్, మీకు సమీపంలోని కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలను మరియు క్వారంటైన్ ఏరియాలను కూడా హైలైట్ చేస్తుంది. మీరు కోవిడ్ -19 వ్యాప్తి గురించి తాజా సలహాలు, మార్గదర్శకాలు మరియు మరింత సమాచారాన్ని కూడా పొందవచ్చు. భారత ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన తాజా అప్డేట్స్ తో వినియోగదారులను అప్రమత్తం చేస్తారు.

వైరస్ బారిన పడిన రోగులను గుర్తించడానికి ఒక అప్లికేషన్ ఉపయోగించడం వెనుక ఉన్న ప్రేరణ, సింగపూర్‌లో ఇప్పటికే ఉన్న ఇలాంటి అప్లికేషన్ నుండి వచ్చి ఉండవచ్చు. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం హైటెక్ నిఘాను అనుసరిస్తోంది. మ్యాప్‌ లో పాజిటివ్‌ రోగులను గుర్తించడమే కాకుండా, బ్లూటూత్‌ను ఉపయోగించడం ద్వారా రోగితో పరిచయం ఉన్న సమీప వ్యక్తులను కూడా ఇది హెచ్చరిస్తుంది.

రాబోయే కొద్ది రోజుల్లో ఈ యాప్ లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. అయితే, ఆప్ యొక్క APK ఎంచుకున్న కొద్ది మందికి పంపిణీ చేయబడుతోంది. iOS వినియోగదారులు తమ ఫోన్ల UDID లను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ తో షేర్ చెయ్యడం ద్వారా  అప్లికేషన్ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo