ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్ సహా 89 యాప్స్ పైన ఇండియన్ ఆర్మీ నిషేధం

ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్ సహా 89 యాప్స్ పైన ఇండియన్ ఆర్మీ నిషేధం
HIGHLIGHTS

మొత్తం 89 యాప్‌లను సైనికులు ఫోన్‌లలో వాడడాన్ని నిషేధించాలని భారత సైన్యం కోరింది.

సైనికులు తమ ఫోన్‌ల నుంచి 89 యాప్‌లను తొలగించాలని సైన్యం కోరుతోం

మన దేశాన్ని కాపాడానికి ముందువరుసలో నిలబడే భారత సైన్యం, ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. అదేమిటంటే, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ట్రూకాలర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ నుండి మొదలుకొని PUBG మొబైల్ వంటి గేమ్స్ వరకూ మరియు టిండెర్, డైలీ హంట్ మరియు అన్ని 'వ్యక్తిగత బ్లాగులు' వంటి డేటింగ్ యాప్స్ వరకు మొత్తం 89 యాప్‌లను సైనికులు ఫోన్‌లలో వాడడాన్ని నిషేధించాలని భారత సైన్యం కోరింది.

నివేదిక ప్రకారం, ఏ విధంగానూ భారత ఆర్మీ సమాచారం లీక్ అవ్వకూడదని భారత సైన్యం కోరుకుంటుంది. అందుకే సైనికులు తమ ఫోన్‌ల నుంచి 89 యాప్‌లను తొలగించాలని సైన్యం కోరుతోంది. ఎందుకంటే, నేరుగా భారత ఆర్మీని ఏమి చెయ్యలేని చైనా మరియు పాకిస్థాన్ వంటి దేశాలు కొంత మంది సైనికులను లేదా ఆఫీసర్లను టార్గెట్ చేసుకొని, కొన్ని యాప్స్ ద్వారా , వలపు ఉచ్చు(హాని ట్రాప్) తోపాటుగా, మరిన్ని మోసపూరిత  ప్రయత్నాలను ఆన్లైన్ ద్వారా చేసేందుకు ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి పెద్ద ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్న 59 చైనీస్ యాప్స్ జాబితాని ప్రభుత్వం నిషేధించింది, కానీ ఈ జాబితా మరింత పెద్దది మరియు ఇది కేవలం చైనా యాప్స్ కి మాత్రమే పరిమితం కాదు. ఇది చైనాతో సంబంధం లేని అనేక ఇతర యాప్స్ ని కలిగి ఉంది.

భారత సైన్యం ఈ 89 యాప్స్ నిషేధించింది

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్  విభాగంలో, భారత సైన్యం WeChat, QQ, Kik, ooVoo, Nimbuzz, Helo, Qzone, Share Chat, Viber, Line, IMO, Snow, To Tok, మరియు Hike వంటి వాటిని నిషేధించింది.

వీడియో హోస్టింగ్ ప్లాట్‌ఫాం

భారతీయ సర్వీస్ లో TikTok, Likee, Samosa మరియు Kwali ఈ విభాగంలో చేర్చారు, టిక్‌టాక్ ఇప్పటికే దేశంలో నిషేధించబడిన విషయం మనకు తెలుసు.

Indian Army నిషేధించిన ఇతర Apps

Shareit, Xender, Zapya, UC Browser, UC Browser Mini, LiveMe, BigoLive, Zoom, Fast Films, Vmate, Uplive, Vigo Video, Cam Scanner, Beauty Plus, Truecaller, PUBG, NONO Live, Clash of Kings, All Tencent gaming apps, Mobile Legends, Club Factory

AliExpress, Chinabrands, Gearbest, Banggood, MiniInTheBox, Tiny Deal, Dhhgate, LightinTheBox, DX, Eric Dress, Zaful, Tbdress, Modility, Rosegal, Shein, Romwe, Tinder, TrulyMadly, Happn, Aisle, Coffee Meets, Bagel, Woo, OkCupid, Hinge, Badoo, Azar, Bumble, Tantan, Elite Sinles, Tagged, Couch Surfing, 360 Security,

ఇతర ప్రముఖ యాప్స్

Facebook, Baidu, Instagram, Ello, Snapchat, Daily Hunt, News Dog, Pratilipi, Heal of Y, POPXO, Vokal, Hungama, Songs.pk, Yelp, Tumblr, Reddit, FriendsFeed, మరియు Private Blogs

వీటితో పాటుగా  ఇప్పటికే భారతదేశంలో నిషేధించబడిన 59 చైనీస్ యాప్స్ కూడా ఈ జాబితాలో వున్నాయి ఈ List ఇక్కడ చూడవచ్చు 

Source :

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo