మరొక వారంలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో Youtube, Gmail వంటి యాప్స్ పనిచేయవు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Sep 2021
HIGHLIGHTS
  • ఈ ఫోన్లలో Youtube, Gmail వంటి యాప్స్ పనిచేయవు

  • ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్స్ పనిచేయడం మానేస్తాయి

  • ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ మీవద్ద ఉందేమో చెక్ చేసుకొండి

మరొక వారంలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో Youtube, Gmail వంటి యాప్స్ పనిచేయవు
మరొక వారంలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో Youtube, Gmail వంటి యాప్స్ పనిచేయవు

మరొక వారంలో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో Youtube, Gmail వంటి యాప్స్ పనిచేయవు.  లేటెస్ట్ గా గూగుల్ తన కొత్త అప్డేట్ వచ్చే వారంలో  విడుదల చేస్తోంది. ఈ కొత్త అప్డేట్ తరువాత కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో Youtube, Gmail మరియు గూగుల్ డ్రైవ్ వంటి చాలా గూగుల్ యాప్స్ పనిచేయవు.

ఎందుకంటే, ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్ మరియు అంతకంటే పైన వచ్చిన వెర్షన్స్ తో మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి, 2.3.7 మరియు అంతకన్నా తక్కువ వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్స్ పనిచేయడం మానేస్తాయి. దీనికి కారణం 2.3.7 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మద్దతును నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సర్వీస్ ఉపయోగించడానికి 3.0 అంతకన్నా పైన వెర్షన్ ను కలిగివుండాలని గూగుల్ తెలిపింది. అంటే కొత్త నిబంధనల ప్రకారం, 3.0 కన్నా తక్కువ వెర్షన్ ఉపయోగించేవారు యూట్యూబ్, జిమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్ తో సహా మరికొన్ని గూగుల్ సర్వీస్ లను ఉపయోగించలేరు. అంటే, గూగుల్ హనీ కాంబ్ వెర్షన్ ను వినియోగదారులు వారి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కలిగి ఉండాలి.

గూగుల్ ఆండ్రాయిడ్ అప్డేట్

ఇప్పటికే గూగుల్ అటువంటి వెర్షన్ వాడేవారికి మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది మరియు సెప్టెంబర్ 2 తరువాత ఆ వెర్షన్ కలిగిన వారు వారి  జిమెయిల్, యూట్యూబ్ మరియు మరికొన్ని గూగుల్ యాప్స్ కి లాగిన అవ్వలేరు. అటువంటి వారు వారి ఫోన్లను రీసెట్ చేసిన లేదా కొత్త అకౌంట్ తో లాగిన్  చేయాలని చూసినా 'యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎర్రర్' ని మాత్రమే చూస్తారు.

అయితే, యాప్స్ ద్వారా మీరు లాగిన్ చెయ్యలేక పోయినా, వెబ్ బ్రౌజరు నుండి లాగిన్ చేయ్యుడానికి వీలుంటుంది. బ్రౌజర్ నుండి ఏదైనా Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా వాటిని ఉపయోగించవచ్చు. మీరు వెబ్ బ్రౌజర్ నుండి ఎంచుకున్న కొన్ని Google సేవలను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: in a week youtube and gmail like google apps could not work in these android smartphones
Tags:
android smartphones google update google upcoming update youtube gmail
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status