ఈ యాప్స్ వాడితే మీ Whatsapp అకౌంట్ బ్యాన్ అవుతుంది..!

ఈ యాప్స్ వాడితే మీ Whatsapp అకౌంట్ బ్యాన్ అవుతుంది..!
HIGHLIGHTS

వాట్సాప్ గట్టిగా హెచ్చరించింది

థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించే యూజర్ల కోసం ఈ హెచ్చరిక చేసింది

ఈ యాప్స్ వాడే అకౌంట్ లను బ్యాన్ చేస్తుందని వాట్సాప్ వెల్లడించింది

గత కొంత కాలంగా వాట్సాప్ తన వినియోగదారులను ఒక విషయం గురించి గట్టిగా హెచ్చరించింది. అదేమిటంటే, వాట్సాప్ యొక్క లీగల్ లేదా అధికారిక యాప్ కాకుండా థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించే యూజర్ల కోసం ఈ హెచ్చరిక చేసింది. థర్డ్ పార్టీలు రూపొందించిన వాట్సాప్ యాప్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అధికారిక Whatsapp App కి మారకపోతే వెంటనే వారి అకౌంట్ లను బ్యాన్ చేస్తుందని వాట్సాప్ వెల్లడించింది.

ఇటువంటి చర్యలను తీసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించింది. వాట్సాప్ ఎప్పుడూ థర్డ్ పార్టీ యాప్స్ ని సపోర్ట్ చెయ్యదని మరియు వాటి వలన జరిగే నష్టాలకు బ్యాధిత తీసుకోదని కూడా తెలిపింది. అందుకే, థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించరాదని కోరింది. అంతేకాదు, మీకు Temporarily Banned వంటి మెసేజిలు కనుక మీకు వస్తే మీరు అధికారిక వాట్సాప్ ఉప్పయోగించడం లేదని అర్ధం. ఎందుకంటే, ఒరిజినల్ అధికారిక వాట్సాప్ యాప్ వాడుతున్న వారికి ఇటువంటి మెసేజ్ లు రావని గుర్తుంచుకుండి.

అందుకే, మీ వాట్సాప్ అకౌంట్ పూర్తిగా బ్యాన్ అవ్వక ముందే అధికారిక వాట్సాప్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని, లాగిన్ అవ్వడం మంచిది. అయితే, మీరు థర్డ్ పార్టీ యాప్ డిలీట్ చేసే ముందుగా మీ అకౌంట్ చాట్ మరియు డేటాని పూర్తిగా బ్యాకప్ చేసుకోండి. తద్వారా, మీ డేటాని సురక్షితం చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo