ఈ పనులు చేస్తే తమ అకౌంట్ నుండి పోగొట్టుకున్న డబ్బులకు మాది కాదు బాధ్యత అంటున్న SBI

ఈ పనులు చేస్తే తమ అకౌంట్ నుండి పోగొట్టుకున్న డబ్బులకు మాది కాదు బాధ్యత అంటున్న SBI
HIGHLIGHTS

తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా హెచ్చరిక జారీచేసింది.

దేశవ్యాప్తంగా, ఆన్లైన్ మోసాలు అధికంగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అందుకోసమే, ఇప్పుడు ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి SBI ఖాతాదారులకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా హెచ్చరిక జారీచేసింది. తమ అకౌంట్ లకు సంబంచిన వివరాలైనటువంటి, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్ లేదా వారి బ్యాంక్ ఖాతాకు సంబంచిన మరే ఇతర వివరాలనైనా సరే అందరికి తేలిసేలా పబ్లిగ్గా ఎటువంటి సోషల్ మీడియాలోనైనా సరే షేర్ చేసినట్లయితే, అటుతరువాత జరిగే నష్టాలకు తాము ఎటువంటి బాధ్యతా వహించమని ప్రకటన చేసింది.

అలాగే, దీని గురించి పూర్తిగా వివరిస్తూ, బ్యాంక్ ఎప్పుడూ కూడా కస్టమర్ల అకౌంట్ లకు సంబధించిన వివరాలను ఎప్పుడు అడగదని తెలిపింది. అందులోనూ, OTP లేదా UPI కి సంభందించిన వివరాలు అడిగే అవసరం కూడా లేదని పేర్కొంది. దీని గురించి మాట్లాడుతూ, " దయచేసి గుర్తుచుకోండి, SBI లేదా అందులోని అధికారులు కానీ మీ అకౌంటుకు సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలైనటువంటి, యూజర్ ID, సెక్యూరిటీ PIN లేదా ఇంటర్నెట్ పాస్వర్డ్ వంటి వాటిని అడగరని, వాటితో వారికీ ఎటువంటి అవసరం ఉండదని మరియు ఫోన్ కాల్, SMS లేదా ఇమెయిల్ ద్వారా ఈ వివరాలను అడిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని" వివరించింది.

వాస్తవానికి, గత కొద్దికాలంగా కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును దండుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమిటంటే, మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, దాన్ని బ్లాక్ చెయ్యకుండా ఉండాలంటే కొన్ని వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుందని, అందులో మీ అకౌంట్ నంబర్ తో సహా మీ సున్నితమైన PIN వంటి వివరాలను కూడా ఇవ్వవలసి ఉంటుందని SMS లేదా ఇమెయిల్ ద్వారా మెసేజిలను పంపుతున్నారు. వాటిని నమ్మి వాటిపైన క్లిక్ చేసి వివరాలను అందించిన వారి ఖాతాల నుండి డబ్బంతా ఊడ్చేస్తున్నారు. అందుకోసమే, SBI తన ఖాతాదారుల శ్రేయస్సు కోసం ఈ హెచ్చరికలను జారీచేసినట్లు తెలుస్తోంది.                                                   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo