హ్యాకర్ల చేతిలో 28 కోట్ల మంది భారతీయుల పూర్తి సమాచారం.!

హ్యాకర్ల చేతిలో 28 కోట్ల మంది భారతీయుల పూర్తి సమాచారం.!
HIGHLIGHTS

హ్యాకర్ల చేతిలో 28 కోట్ల మంది భారతీయుల పూర్తి సమాచారం

ఎటువంటి వివరాలను హ్యాక్ చేసి సేకరించారో తెలిస్తే మరింత షాక్ కు గురవుతారు

ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హ్యాకర్ల ద్వారా ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది

హ్యాకర్ల చేతిలో 28 కోట్ల మంది భారతీయుల పూర్తి సమాచారం వెళ్లినట్లుగా, ఉక్రెయిన్‌కు చెందిన సెక్యూరిటీ ఎక్స్ పర్ట్  బాబ్ డయాచెంకో తెలిపారు. హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లుగా చెబుతున్న ఈ సమాచారం ఎక్కడి నుండి పొందారో తెలిస్తే మరింత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, ఈ డేటా మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ నుండి హ్యాకర్లు దొంగిలించినట్లుగా చెబుతున్నారు. ఇక్కడితో కథ అయిపోలేదు, ఆ సమాచార డేటా మొత్తం ఆన్లైన్లో లీక్ అయ్యింది. ఈసారి హ్యాకర్లు ప్రజల వ్యక్తిగత వివరాలను కూడా సేకరించినట్లు కూడా చెబుతున్నారు.

ఇక హ్యాకర్లు ఎటువంటి వివరాలను హ్యాక్ చేసి సేకరించారో తెలిస్తే మరింత షాక్ కు గురవుతారు. ఎందుకంటే, హ్యాకర్లు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తో పాటుగా, మ్యారిటల్ స్టేటస్, ఆధార్ వివరాలు మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా సేకరించారు. అంటే, ఈసారి ఎంత సున్నితమైన డేటా హ్యాక్ కు గురయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హ్యాకర్ల ద్వారా ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది. ఈ లీక్ లో దాదాపుగా 28 కోట్ల మంది భారతీయుల ఇన్ఫర్మేషన్ రెండు భాగాలుగా లీక్ అయిందని బాబ్ డయాచెంకో తెలిపారు.

రెండు IP అడ్రస్ లను ఉపయోగించి మైక్రో సాఫ్ట్ అజూర్ క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ఈ పనిని చేశారు. ఈ సంచలన సమాచారాన్ని LinkedIn లో ఆగస్టు 2 న పోస్ట్ చేశాడు. అతని వాదన ప్రకారం, UAN అనే డేటా క్లస్టర్ 2 వేర్వేరు IP చిరునామాల నుండి కనుగొనబడింది. ఈ బాబ్ డయాచెంకో ఈ విషయం గురించి మరింత వివరిస్తూ, ఈ శాంపిల్ స్వీకరించిన తర్వాత, జనరల్ బ్రౌజర్ సహాయంతో దానిని పరిశీలించి, అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సమాచారం ఎవరిది అనేది మాత్రం తెలియరాలేదు.

బాబ్ డయాచెంకో ఈ హ్యాక్ ను గురించి భారతదేశంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను తన ట్వీట్ ద్వారా అప్రమత్తం చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన 12 గంటల్లోనే ఐపీ అడ్రస్ తొలగించారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo