Gold : ఎంత పెరిగిందో అంత తగ్గిన బంగారం ధర.!

Gold : ఎంత పెరిగిందో అంత తగ్గిన బంగారం ధర.!
HIGHLIGHTS

ఎంత పెరిగిందో అంత తగ్గిన బంగారం ధర

భారీగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు పడిపోయింది

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ అప్డేట్

Gold : ఎంత పెరిగిందో అంత తగ్గిన బంగారం ధర. నిన్న మార్కెట్ లో ఎంత పెరిగిందో, అంతే తరుగుదలను ఈరోజు బంగారం ధర చూసింది. వాస్తవానికి, గడిచిన రెండు రోజుల్లో గోల్డ్ మార్కెట్ భారీగా పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు పడిపోయింది. అయినప్పటికీ, ఈరోజుకి కూడా బంగారం ధర 'అందని ద్రాక్ష పుల్లన' సామెతను గుర్తుకు తెస్తోంది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దామా. 

Gold Price Live:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు 500 రూపాయలు క్రిందకు దిగి  రూ.53,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,470 నుండి 540 రూపాయలు క్రిందకు దిగి రూ.57,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో పెరిగిన గోల్డ్ రేట్ ఈరోజు పడిపోయింది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,930 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,930 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,080 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,070 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo