రెండు ఫేమస్ ZEBRONICS Dolby సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ బిగ్ డిస్కౌంట్.!
ZEBRONICS Dolby సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ బిగ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది
జెబ్రానిక్స్ సౌండ్ బార్ లు ఈరోజు సమ్మర్ సేల్ ద్వారా మంచి ఆఫర్ ధరలో మీకు లభిస్తాయి
బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోరుకునే వారు ఈ డీల్స్ ను పరిగణలోకి తీసుకోవచ్చు
రెండు ఫేమస్ ZEBRONICS Dolby సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ బిగ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలై మంచి అమ్మకాలను సాధించిన రెండు జెబ్రానిక్స్ సౌండ్ బార్ లు ఈరోజు సమ్మర్ సేల్ ద్వారా మంచి ఆఫర్ ధరలో మీకు లభిస్తాయి. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోరుకునే వారు ఈ డీల్స్ ను పరిగణలోకి తీసుకోవచ్చు.
SurveyZEBRONICS Dolby సౌండ్ బార్ : ఆఫర్
జేబ్రోనిక్స్ యొక్క Juke Bar 9600 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మరియు Juke Bar 9400 Pro 5.1 డాల్బీ డిజిటల్ ప్లస్ రెండు సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ రెండు సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ మరియు ఫీచర్స్ వివరంగా తెలుసుకుందాం.

జెబ్రోనిక్స్ Juke Bar 9600
ఈ సౌండ్ బార్ జెబ్రోనిక్స్ అందించిన బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ రెగ్యులర్ గా 9 వేల రూపాయల ధరలో సేల్ అయ్యేది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో 4 హై క్వాలిటీ స్పీకర్లు ఉంటాయి మరియు జతగా వచ్చే సబ్ ఉఫర్ మంచి డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Also Read: Infinix NOTE 60 Pro 5G: హార్ట్ రేట్ సెన్సార్ వంటి సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
జెబ్రోనిక్స్ Juke Bar 9400 Pro
ఇది 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఇది నిన్న మొన్నటి వరకు రూ. 8,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 525W సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీ తో మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.ఇది కూడా ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile