Gold Price Live: ఈరోజు పడిపోయిన బంగారం ధర.!

Gold Price Live: ఈరోజు పడిపోయిన బంగారం ధర.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో బంగారం ధర పడిపోయింది

గత రెండు రోజులుగా పెరిగిన గోల్డ్ రేట్

ఈరోజు Gold Price క్రిందకు దిగజారింది

Gold Price Live: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర పడిపోయింది. గత రెండు రోజులుగా పెరిగిన గోల్డ్ రేట్ ఈరోజు క్రిందకు దిగజారింది. కేవలం గడిచిన రెండు రోజుల్లోనే తులానికి 800 పైగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు 600 కు పైగా తరుగుదలను నమోదు చేసింది. ఈరోజు మార్కెట్ లో మదుపర్లు గోల్డ్ ను కొనడానికి కంటే, అమ్మడానికి ఎక్కవ మక్కువ చూపడంతో గోల్డ్ రేట్ లో ఈ మార్పు జరగడానికి కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో సహా దేశరాజధానిలో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.

Gold Price Live

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,100 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 600 రూపాయలు  తరుగుదలను నమోదు చేయడంతో రూ.52,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,930 నుండి 600 రూపాయలు పడిపోయి రూ.57,270 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,270 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,420 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,420 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,310 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo