హువావే మరియు హానర్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ కోసం EMUI 10 రోడ్ మ్యాప్ విడుదల

హువావే మరియు హానర్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10  అప్డేట్ కోసం EMUI 10 రోడ్ మ్యాప్ విడుదల
HIGHLIGHTS

హువావే మరియు హానర్ కి సంభందించిన 30 కంటే ఎక్కువ ఫోన్లకు ఈ అప్డేట్ అందనుంది.

హువావే, తన స్మార్ట్ ఫోన్లలో త్వరలో EMUI 10 కోసం రోడ్ మ్యాప్ ప్రకటించింది. అలాగే, ఈ సంస్థ యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ ఫోన్లలో కూడా ఈ అప్డేట్ అందనుంది. దీనితో, ఆండ్రాయిడ్ 10 ఈ ఫోన్లలో అప్డేట్ అవుతుంది. హువావే మరియు హానర్ కి సంభందించిన 30 కంటే ఎక్కువ ఫోన్లకు ఈ అప్డేట్ అందనుంది.  అయితే, ఈ అప్డేట్ సెప్టెంబర్ 2019 మొదలుకొని 2020 రెండవ త్రైమాసికం (Q2) వరకూ ఈ అప్డేట్ కొనసాగుతుంది.

ముందుగా, ఈ సెప్టెంబర్ 19 వ తేదికి హువావే మేట్ 30 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ కి డేట్ సెట్ చెయ్యగా, ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ OS తో రాకపోవచ్చని కొన్ని నివేదికలు అంచనా వేస్తుండగా, ఈ రోడ్ మ్యాప్ లో మొదటగా ఆండ్రాయిడ్ 10 పైన ఆధారితంగా EMUI 10 స్కిన్ తో ఈ స్మార్ట్ ఫోన్ రానున్నట్లు ఈ రోడ్ మ్యాప్ చెబుతోంది. ముందుగా, ఈ XDA డెవలపర్స్ అందించిన నివేదిక ప్రకారం చూస్తే, ఇది నిజం కావచ్చని అనిపిస్తోంది.

అలాగే, నవంబర్ 2019 నెలలో హుయేవే P30 మరియు P30 ప్రో వేరియంట్లకు ఈ అప్డేట్ అందుతుంది. ఇక ఈ సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్ నెలలో హువావే మేట్20, 20 ప్రో, RS, మరియు మేట్ X వాటిని అప్డేట్ అందుకుంటాయి. అలాగే, ఇదే నెలలో హానర్ నుండి హానర్ 20, 20 ప్రో మరియు హానర్ వ్యూ 20 వాటి ఫోన్లు అప్డేట్ అందుకోనున్నాయి.

ఇక నాల్గవ దశలో, హువావే P30 లైట్, హువావే P20 సిరీస్ ఫోన్లు మరియు హువావే మేట్ 10 సిరీస్ ఫోన్లు మార్చ్ 2020 నెలలో అప్డేట్ ను అందుకుంటాయి. చివరిగా, 2020 రెండవ త్రైమాసికంలో మిగిలి హువావే హానర్ స్మార్ట్ ఫోన్లు ఈ అప్డేట్ ను పొందనునట్లు ఈ రోడ్ మ్యాప్ ప్రకటించింది.                                                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo