మీరు స్మార్ట్‌ఫోన్ ను ఇతరులు చూడకుండా లేదా ఇతరుల నుండి సురక్షితంగా ఉంచడం కోసం పాస్వర్డ్ నుండి ఉపయోగిస్తాము లేదా సెట్ చేస్తాము. అయితే, మీ స్మార్ట్‌ఫోన్ ను లాక్ చేయకుండా వదిలేసినా కూడా మీ ఫోన్ ఎవరూ చూడకుండా చేయవచ్చని మీకు తెలుసా?. అవును, మీరు నిజంగానే ఇలా చేసే అవకాశం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లలో వుంది. దీనికోసం, కేవలం మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.
Survey
✅ Thank you for completing the survey!
వాస్తవానికి, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో ఉంటుంది. వీటితో, మీ స్మార్ట్‌ఫోన్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ చాలా పటిష్టంగా మార్చుకోవచ్చు. తద్వారా, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లోని డేటాని సురక్షితం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ నవీన యుగంలో మొత్తం పర్సనల్ డేటా కూడా ఈ స్మార్ట్ ఫోన్ల లోనే ఎక్కువగా స్టోర్ చేస్తున్నారు. పైన తెలిపిన విధంగా మీ స్మార్ట్‌ఫోన్ ను లాక్ చేయకుండానే డేటాను సురక్షితం చేసే ఫీచర్ ను 'Screen Pinning' అని పిలుస్తారు.
మరి మీ స్మార్ట్‌ఫోన్ లో ఈ Screen Pinning సెట్టింగ్ ఎలా చేయాలో ఈ క్రింద చూడండి.
ముందుగా, మీ ఫోన్ Settings ఓపెన్ చేయండి
ఇక్కడ సెక్యూరిటీ మరియు లాక్ స్క్రీన్ అప్షన్ ను ఎంచుకోండి
ఇక్కడ ప్రైవసీ కోసం చాలా ఎంపికలు కనిపిస్తాయి
కానీ, ఇక్కడ Screen Pinning లేదా Pin The Screen అప్షన్ ఎంచుకోని On చేయండి
అయితే, సాసంగ్ Screen Pinning స్మార్ట్‌ఫోన్స్ లో పిన్ విండోస్ అనే ఫీచర్ కనిపిస్తుంది
తరువాత, మీరు ఏ యాప్స్ ని పిన్ చేస్తారో అవి మాత్రమే ఇతరులు చూడవచ్చు
ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ నుండి పైన అన్ని OS లలో లభిస్తుంది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వారికి మీ ఫోన్ లాక్ చేయకుండా ఇచ్చిన కూడా మీరు పిన్ చేసిన Apps తప్ప మరింకేమి కనిపించదు.