Google Photos నుండి డిలీట్ చేసిన ఫోటోలను ఎలా రీస్టోర్ చెయ్యాలి..!!

HIGHLIGHTS

Google Photos నుండి డిలీట్ చేసిన ఫోటోలను ఎలా రీస్టోర్ చెయ్యాలి

చాలా సులభంగా తిరిగిపొందే విధానం గురించి ఈరోజు చుడనున్నాము

గూగుల్ ఫోటోస్ ద్వారా మీరు మీ ఫోటోలను ఏ డివైజ్ నుండైనా యాక్సెస్ చేయవచ్చు

Google Photos నుండి డిలీట్ చేసిన ఫోటోలను ఎలా రీస్టోర్ చెయ్యాలి, అని ఆలోచిస్తున్నారా? మీరు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు మీరు అనుకోకుండా మీ ఫోటోలను గూగుల్ ఫోటోస్ డిలీట్ చేసినట్లయితే, చాలా సులభంగా తిరిగిపొందే విధానం గురించి ఈరోజు చుడనున్నాము. వాస్తవానికి, గూగుల్ ఫోటోస్ అనేది గొప్ప ఫోటో బ్యాకప్ సర్వీస్ మరియు లిమిటెడ్ స్టోరేజ్ కి ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈ సర్వీస్ ద్వారా మీరు మీ ఫోటోలను ఏ డివైజ్ నుండైనా యాక్సెస్ చేయవచ్చు మరియు వాటిని Cloud ‌లో బ్యాకప్ కూడా చేయవచ్చు.

కానీ, అనుకోకుండా  మీ ఫోటోలు మరియు వీడియోలను డిలీట్ చేసే అవకాశం వుంటుంది. చెప్పను కదా, ఒకవేళ మీరు Google Photos నుండి అనుకోకుండా ఏదైనా ఫోటో లేదా వీడియోలను తొలగించిన 60 రోజుల్లోపు వాటిని చాలా సులభంగా తిరిగి పొందవచ్చు. అనుకోకుండా గూగుల్ ఫోటోస్ నుండి తొలగించిన ఫోటోలు మరియు వీడియోలను ఎలా తిరిగి రిస్టోర్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకోండి.   

కంప్యూటర్‌ లో

మీ కంప్యూటర్‌ లో Google Photos ను తెరవండి

మీరు ఇప్పటి వరకూ సైన్ కాకపోతే మీ Google Account కు సైన్ ఇన్ చేయండి.

ఎడమ వైపున ఉన్న మెనులోని ‘Trash’ పై క్లిక్ చేయండి.

మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటోలను ఎంచుకోండి మరియు కుడి ఎగువ మూలలోని  ‘Restore’  బటన్ ‌పైన క్లిక్ చేయండి.

మీ ఫోటోలు ఇప్పుడు మీ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి.

IOS మరియు Android లో

మీ ఫోన్‌ లో  Google Photos యాప్ తెరవండి.

ఎగువ ఎడమ వైపున ఉన్న మూడు వరుసల లేదా ‘Hamburger’ చిహ్నంపై క్లిక్ చేయండి.

‘Trash’ పై క్లిక్ చేయండి

మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటోలను ఎక్కువసేపు నొక్కడం ద్వారా ఎంచుకోండి

‘Restore’ బటన్ పై క్లిక్ చేయండి

మీ ఫోటోలు ఇప్పుడు లైబ్రరీలో కనిపిస్తాయి.

మీ ఫోటోలను ఎప్పుడు మీరు Restore చేయలేరు

60 రోజుల కంటే ముందుగా ‘Trash’ కి తరలించిన ఫోటోలు మరియు వీడియోలు.

మీరు ట్రాష్ నుండి శాశ్వతంగా తొలగించిన ఫోటోలు మరియు వీడియోలు

మీ డివైజ్ ని బ్యాకప్ చేయకుండా మీరు మీ ఫోటో గ్యాలరీ నుండి శాశ్వతంగా తొలగించిన ఫోటోలు.

మీరు ‘Trash’ తరలించి తరువాత, Emty చేసిన తరువాత.

ఈ పైన తెలిపిన సాందర్భాల తరువాత ఆ ఫోటోలు లేదా వీడియోలను మీరు తిరిగి తీసుకురాలేరు.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :