వాట్సాప్ Call Recording ఎలా చెయ్యాలి

HIGHLIGHTS

Whatsapp Call Recording చాలా సులభం

వాట్సాప్ కాల్ ను ఎలా రికార్డ్ చెయ్యాలి

చాలా ఈజీగా రికార్డింగ్ చెయ్యవచ్చు

వాట్సాప్ Call Recording ఎలా చెయ్యాలి

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన చాటింగ్ యాప్ వాట్సాప్. అలాగే, ఈ యాప్ చాటింగ్ తో పాటుగా వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ మరియు మీడియా షేరింగ్ వంటి మన రోజువారీ అవసరాలకు సరైన స్థలంగా మారింది. అయితే, కొన్ని సందరభాల్లో వాట్సాప్ కి అనుసంధానమైన కొన్ని ట్రిక్స్ మరియు టిప్స్ తెలియక చాలా ఫీచర్లు మిస్ అవుతుంటారు. వాటిలో, Whatsapp Call Recording కూడా ఒకటి. అందుకే, ఈరోజు వాట్సాప్ కాల్ ను ఎలా రికార్డ్ చెయ్యాలి? అనేవిషయం గురించి తెల్సుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, సాధారణ కాల్ ని చాలా ఈజీగా రికార్డింగ్ చెయ్యవచ్చు. ఆటో కాల్ రికార్డింగ్ లేదా కాల్ వచ్చినప్పుడు అక్కడ ఉండే కాల్ రికార్డ్ అప్షన్ ను నొక్కడం ద్వారా కాల్ రికార్డ్ చేయవచ్చు. అదే Whatsapp Call Recording చెయ్యాలంటే ఎలా? ఇక్కడ విషయాన్ని గురించి చూడవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో Whatsapp Call Recording చాలా సులభంగా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం, గూగుల్ ప్లే స్టోర్ లో చాలా తర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో వున్నాయి.Cube Call Recorder వంటి మరేదైనా తర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత, మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వారికీ కాల్ చేయండి. ఇక్కడ కాల్ రికార్డింగ్ ఐకాన్ కనబడుతుంది. అంటే, మీ వాట్సాప్ కాల్ రికార్డ్ అవుతుందని అర్ధం.

ఇక iOS ఫోన్ల విషయానికి వస్తే, ఈ ఫోన్లలో వాట్సాప్ కాల్ రికార్డింగ్ కోసం మీ వద్ద Mac సిస్టమ్ మరియు ఐఫోన్ కూడా ఉండాలి. ఈ పద్దతిలో మీ iPhone ను Mac బుక్ కు కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అయిన తరువాత, క్విక్ టైం అప్షన్ లోకి వెళ్ళి న్యూ ఆడియో రికార్డింగ్ ను ఎంచుకోవాలి. ఇక్కడ క్విక్‌టైమ్‌లోని రికార్డ్ బటన్ పక్కన, డౌన్ ఆరో క్లిక్ చేసి ఐఫోన్ ఎంపికను క్లిక్ చేయండి. తరువాత క్విక్ టైం లోని రికార్డ్ నొక్కండి. తరువాత, మీ ఐఫోన్ ద్వారా మీ ఇతర ఫోన్‌ WhatsApp కి కాల్ చేయండి.

కనెక్ట్ అయిన తర్వాత, మరొక ఫోన్‌లో కాల్‌ను స్వీకరించండి మరియు మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తిని జోడించండి. ఈవిధంగా,  కాల్స్ రికార్డ్ చేయవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo