మీ మొబైల్ నంబర్ ను BSNL కి పోర్ట్ చేసుకోవాలా

మీ మొబైల్ నంబర్ ను BSNL కి పోర్ట్ చేసుకోవాలా
HIGHLIGHTS

20 నుండి 25 శాతం పెరిగిన జియో, Vi మరియు ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్స్

ప్పుడు అందరికి కనిపిస్తున్న ఏకైక మార్గంగా BSNL కనిపిస్తోంది

మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు

ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో టెలికం కంపెనీలు వారి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరలను అమాంతంగా పెంచేశాయి. అదికూడా 20 నుండి 25 శాతం వరకూ పెంచడంతో వినియోగదారులకు రీఛార్జ్ కష్టాలు మొదలయ్యాయి. అందుకే, వినియోగధారులు కూడా ప్రత్యామ్న్యాల కోసం చూస్తున్నారు. అయితే, ఇప్పుడు అందరికి కనిపిస్తున్న ఏకైక మార్గంగా BSNL కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ప్రభుత్వ టెలికం సంస్థ ఇప్పటికి కూడా తక్కువ ధరకే తన రీఛార్జ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తుండటమే కారణం.

అందుకే కాబోలు 'How To Port My Mobile Number To BSNL' అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయంగా చే చెబుతున్నారు. మరి ఇదే విషయం గురించి మీరు కూడా తెలుసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ క్రింద సూచించిన విధంగా చేయండి. ఇలా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు.

మీ సిమ్ కార్డ్ ను BSNL కు ఎలా పోర్ట్ చేయాలి?

మీరు పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, PORT 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మోబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా SIM స్టోర్‌లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను అందచేస్తారు.

అయితే, దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పించ వాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు. మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు BSNL నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది. తరువాత, మీరు మీ అవసరానికి అనువైన BSNL ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo