Voter లిస్ట్ లో మీ పేరు లేదా?

Voter లిస్ట్ లో మీ పేరు లేదా?
HIGHLIGHTS

Voter లిస్ట్ లో మీ పేరు లేదా

మీ Voter ID యొక్క స్టేటస్

మీ స్మార్ట్ ఫోన్ నుండే ఆన్లైన్ లో

Voter లిస్ట్ లో మీ పేరు లేదా? అయితే, మీ Voter ID యొక్క స్టేటస్ ని ఒకసారి చెక్ చెయ్యడం చాలా మంచిది. ఇది చాలా సింపుల్ మరియు మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. కేవలం, మీ స్మార్ట్ ఫోన్ నుండే ఆన్లైన్ లో చాలా సులభంగా చెక్ చేయవచ్చు. అంతేకాదు, మీ ఓటర్ ఐడి లో ఏదైనా తప్పులు ఉంటే, వాటిని కూడా సరిచేసేందుకు ఇక్కడ నుండి ఒక చిన్న అప్లికేషన్ మీరే నేరుగా పంపవచ్చు. అందుకే, దీని గురించి సవివరంగా తెలుసుకోండి .

దీనికోసం మీరు చేయాల్సిందల్లా, ఎలక్షన్ కమిషన్ ఓటర్ల ఓటును తనిఖీ చేసుకోవడనికి అందించే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ సూచించిన కొన్ని వివరాలను అందిస్తే సరిపోతుంది. మీకు దీనిగురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.

ఇక్కడ మీరు మీ వివరాలతో పాటుగా ఓటరు ID లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి కావాల్సిన "Form 8"  మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మార్చుకోవడానికి అవసరమైన "Form 6" మరియు మరికొన్ని అప్లికేషన్ ఫారమ్ లను కూడా చూడవచ్చు.

మీ ఓటు యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం

ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి 

1.  https://electoralsearch.in వెబ్ సైట్ యొక్క పోర్టల్ లోకి ప్రవేశించాలి.

2. ఇక్కడ సూచించిన దగ్గర మీ పేరును ఎంటర్ చేయాలి

3. దాని క్రింద మీ వయసు లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి

4. పురును ఎంటర్ చేసిన ప్రక్క బాక్సులో మీ తండ్రి పేరు రాయండి

5. దాని క్రింద మీ జెండర్ (స్త్రీ/పురుషులు) ఎంచుకోండి

6. ఇక రెండవ ప్రధాన బాక్సులో, State అని సూచించిన దగ్గర మీ రాష్ట్రాన్ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

7.  దాని క్రింద బాక్సులో District  అని సూచించిన దగ్గర మీ జిల్లాని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

8. ఇక చివరిగా మీ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ని ఇచ్చిన లిస్టు నుండి ఎంచుకోండి

9. అన్నింటికంటే క్రింద ఇచ్చిన "CODE" బాక్సులో అక్కడ అందించిన ఇంగ్లీష్ లెటర్స్ న్టర్ చేసి సెర్చ్ బటన్ పైన నొక్కండి

10. ఇక్కడ సెర్చ్ క్రింద మీ ఓటు వివరాలు వస్తాయి. ఇక్కడ "View Details" పైన నొక్కడంతో పూర్తి వివరాలను చూడవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo