మీ ఆధార్ పైన ఎన్ని SIM కార్డ్ లను తీసుకున్నారో చెక్ చేయడం ఎలా..!

మీ ఆధార్ పైన ఎన్ని SIM కార్డ్ లను తీసుకున్నారో  చెక్ చేయడం ఎలా..!
HIGHLIGHTS

మొబైల్ నంబర్ ను వారి ఆధార్ తో లింక్ చెయ్యడం తప్పనిసరి

మీ ఆధార్ నంబర్ పైన తీసుకున్న అన్ని SIM కార్డ్ వివరాలు

యాక్టివ్ నంబర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు

భారత ప్రభుత్వం ప్రతిఒక్కరి మొబైల్ నంబర్ ను వారి ఆధార్ తో లింక్ చెయ్యడం తప్పనిసరి చేసింది. అంతేకాదు, కొత్త మొబైల్ నంబర్ ని తీసుకోవడానికి లేటెస్ట్ ఫోటో తో కూడిన అప్లికేషన్ లో ఆధార్ వివరాలు మరియు బయోమెట్రిక్ లను కూడా అందించాలి. అప్పుడు మాత్రమే మీరు కొత్త మొబైల్ నంబర్ ను పొందగలరు.

కానీ, మీ ఆధార్ కార్డు పైన ఎన్ని మొబైల్ నంబర్లను తీసుకున్నారో, అందులో ఎన్ని నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో చెక్ చెయ్యాలంటే ఎలాగ? అందుకే, ఇటువంటి అవసరాన్ని గుర్తించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఒక కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ & కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో ఈ వెబ్సైట్ ను తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్ పైన తీసుకున్న అన్ని SIM కార్డ్ ల వివరాలను మరియు యాక్టివ్ నంబర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు.

మీ ఆధార్ నంబర్ పైన ఉన్న SIM కార్డ్ వివరాలను పొందడానికి ఈ క్రింది ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.  

మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo