మీ ఆధార్ నిజమైనదా లేక నకిలీదా? ఒక్కసారి చెక్ చేసుకోండి..!

HIGHLIGHTS

మీ ఆధార్ నకిలీదా లేక నిజమైందా

ఎలా చెక్ చేస్తారు

స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చెక్ చెయ్యొచ్చు.

మీ ఆధార్ నిజమైనదా లేక నకిలీదా? ఒక్కసారి చెక్ చేసుకోండి..!

మన దేశంలో ఎటువంటి అవసరం కోసమైనా ప్రధమంగా ఉపయోగించే లేదా అడిగే ప్రధాన ఐడెంటిటీ ప్రూఫ్ అనగానే, తడుముకోకుండా ఠక్కున చెప్పే సమాధానం 'ఆధార్ కార్డ్' . మరి, అదే ఆధార్ కార్డు కనుక నీకిలిదైతే. అవును, మీరు విన్నది నిజమే ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభత్వం ఇచ్చిన ఆధార్ కార్డులు ఖచ్చితంగా నిజమైనవే. కానీ, అక్కడక్కడా కొన్ని నకిలీ ఆధార్ కార్దులు కూడా ఉన్నట్లు వార్తల్లో చూస్తుంటాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మరి, వాటిలో మీ ఆధార్ కూడా ఉందని డౌటు రావచ్చు. అందుకే, ఎటువంటి ఆ అనుమానాలకు తావివ్వకుండా ఎవరి ఆధార్ కార్డు అయినా సరే నిజమైనదా లేక నకిలీదా అని చెక్ చేకునేనుందుకు ప్రభుత్వం సరైన మార్గాన్ని కూడా అందించింది. ఈ మార్గం ద్వారా మీరు కూడా మీ ఆధార్ కార్డు ని చెక్ చేసుకోవచ్చు. మరి అది ఎలాగ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…!         

మీ ఆధార్ నిజమైనదా లేక నకిలీదా?  అని ఎలా చెక్ చేయాలి ?

దీని కోసం, ముందుగా మీరు www.uidai.gov.in కు వెళ్ళాలి. అయితే, ఇక్కడ నుండి చాలా ఇతర విభగాలకు వెళ్ళవలసి వుంటుంది. అందుకే, మీరు నేరుగా మైన్ పేజ్ వెబ్‌సైట్‌ కు వెళ్లాలనుకుంటే https://resident.uidai.gov.in/verify కు వెళ్లాలి. ఇక్కడ మీరు మీ ఆధార్ ని సరైనదా కాదా అని ధృవీకరించడానికి, Aadhaar Number అని సూచించిన వద్ద మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తరువాత, క్రింద అడగబడిన Captcha Verification ని కూడా ఎంటర్ చేసి Proceed To Verify పైన నొక్కాలి.

తరువాత, మీకు మీ ఆధార్ గురించి వివరాలు అందించ బడతాయి. ఇందులో, మీరు ఎంటర్ చేసిన ఆధార్ సరైనదైతే, ఇందులో Age Group,జెండర్, రాష్ట్రం మరియు రిజిస్టర్ మొబైల్ నంబర్ చివరి మూడు అంకెలు వంటి వివరాలు చూపించ బడతాయి. ఇలాగ, మీ ఆధార్ నిజమైనదా లేక నకిలీదా అనే దాని పైన క్లారిటీ వస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo