సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందుగా ఎలా చెక్ చెయ్యాలంటే..!!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందుగా ఎలా చెక్ చెయ్యాలంటే..!!
HIGHLIGHTS

సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందు ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం ఉత్తమం

చెక్ చెయ్యకుండా తీసుకుంటే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు

ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు నిర్ధారించుకోవడం మంచిది

మీరు ఒక సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, సెకెండ్ హ్యాండ్ ఫోన్ సరైనదో లేక కాదో చెక్ చెయ్యకుండా తీసుకుంటే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. కొత్త ఫోన్ ధరలో సగం ధరకే ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వీలుంటుంది కాబట్టి, ప్రీమియం ఫోన్లను సగం ధరకే అందుకోవచ్చని కొందరు వినియోగదారుల సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఎంచుకుంటారు. అయితే, మీరు తీసుకున్న ఫోన్ ఒరిజినల్ అవునా లేక కాదా అనే విషయం మీరు నిర్ధారించుకోవడం మంచిది.

మరి ఏమి చెయ్యాలి?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ నుండి మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు.

ఎలా చెక్ చెయ్యాలి ?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేక డూప్లికేట్ లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉన్నదా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.

ఈ క్రింది విధంగా చెక్ చెయ్యొచ్చు

ముందుగా CEIR పోర్టల్ లోకి వెళ్ళండి

ఇక్కడ మైన్ పేజ్ లో అప్లికేషన్ లోకి వెళ్ళండి

ఇక్కడ మీకు Know Your Mobile APP మరియు IMEI  Verification అనే రెండు అప్షన్స్ వస్తాయి.

వీటిలో, IMEI  Verification అనే రెండు అప్షన్ ఎంచుకోండి

ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి

మీకు అందిన OTP ఎంటర్ చేసి ఎంటర్ చేయండి

ఇక్కడ మీరు IMEI కోసం సూచించిన బాక్స్ లో  ఇమెయిజ్ నంబర్ ఎంటర్ చేయండి

ఒకవేళ మీరు తీసుకోవాల్సిన ఫోన్ IMEI నంబర్ తెలియక పొతే *#06# తో తెలుసుకోవచ్చు

 చివరిగా, మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు వివరాలు అందించబడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo