HIGHLIGHTS
LPG గ్యాస్ సిలిండర్ కేవలం రూ. 9 రూపాయలకే పొందవచ్చు
Paytm కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్
LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన క్యాష్ బ్యాక్ అఫర్
LPG గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరిగి పోతుంటే Paytm మాత్రం తన కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్ ప్రకటించింది. ప్రస్తుతం, Paytm తన యూజర్ల కోసం గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన క్యాష్ బ్యాక్ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా రూ. 809 రూపాయల విలువగల LPG గ్యాస్ సిలిండర్ కేవలం రూ. 9 రూపాయలకే పొందవచ్చు.
Surveyఇది క్యాష్ బ్యాక్ అఫర్ కాబట్టి పూర్తి డబ్బును ముందుగా చెల్లించాలి. తరువాత, క్యాష్ బ్యాక్ రూపంలో 800 రూపాయలను మీరు తిరిగి పొందుతారు. దీనికోసం, మీరు Paytm నుండి గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాల్సి వుంటుంది. ఇది చాలా సింపుల్, Paytm లో Book a cylinder పైన నొక్కాలి. తరువాత, మీకు క్రింద గ్యాస్ కంపెనీ పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ మీ కావాల్సిన కంపెనీ ని ఎంచుకోవాలి.
ఉదాహరణకు మీ గ్యాస్ Indane గ్యాస్ అయితే, Indane గ్యాస్ ని ఎంచుకోండి. తరువాత, క్రింద మీ కంజ్యూమర్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దానికి క్రింద మీ ఏజెన్సీ ఎంచుకోండి. దీనికోసం, లోపలే అప్షన్ ఇవ్వబడి వుంటుంది. ఈ విధంగా మీ బుకింగ్ అయిన వెంటనే అఫర్ యాక్టివేట్ అవుతుంది.
LPG గ్యాస్ సిలిండర్ పైన Paytm అఫర్ చేస్తున్న ఈ క్యాష్ బ్యాక్ అఫర్ కేవలం మొదటిసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు, Paytm ఈ క్యాష్ బ్యాక్ ను పేటియం TC ప్రకారం స్క్రాచ్ కార్డ్ రూపంలో 800 రూపాయల వరకు అందిస్తుంది.